బ్లూఫిల్మ్స్‌కు బానిసైన భర్త: అలానే చేయాలంటూ భార్యకు వేధింపులు
అజ్మీర్: 21వ శతాబ్ధంలో మానవుని గొప్ప ఆవిష్కరణల్లో మొబైల్ ఒకటి. ప్రపంచం వ్యాప్తంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి మొబైల్ వినియోగం పెడదారి పడుతుందనడానికి ఇదే ఘటనే నిదర్శనం. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషిలోని వికృత కోణాలు బయటపెడుతున్నాయి.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో చిన్న బట్టల కొట్టు వ్యాపారం చేసుకునే రాజీవ్ (అసలు పేరు కాదు) అనే వ్యక్తి కొన్నాళ్ల కిందట ఎంతో కష్టపడి స్మార్ట్‌ఫోన్ కొనుకున్నాడు. దానిని తన బిజినెస్‌లో కొత్త టెక్నాలజీ, వెరైటీల గురించి తెలుసుకోవడానికి ఉపయోగించకుండా కేవలం నీలిచిత్రాలు డౌన్‌లోడ్ చేసుకుని వాటిని చూసేందుకే ఉపయోగించాడు.
అలా నీలిచిత్రాలు చూసి చూసిన తనలోని వికృత రూపం బయటకు పడింది. నీలిచిత్రాల్లో నటించే వారు చేసేలాగే చేయమని 13 ఏళ్లుగా కాపురం చేస్తున్న భార్యని వేధించడం మొదలుపెట్టాడు. మొదట్లో తిరస్కరించిన ఆ మహిళ తర్వాత అతను చెప్పినట్టే చేయసాగింది.

అయితే రోజులు గడుస్తున్న కొద్దీ అతను లెక్కకు మించి నీలిచిత్రాలను డౌన్‌లోడ్ చేసి అదేవిధంగా తన భార్యను అనుకరించమని వేధించసాగాడు. చివరకు ఓపిక, సహనం నశించిన ఆమె ఎదురు తిరిగింది. ఇకపై అలాంటివి చేసేది లేదని తేల్చి చెప్పింది.
అప్పటికే నీలిచిత్రాలకు బానిసగా మారిపోయిన రాజీవ్... అమెను ఇంట్లో పెట్టి చిత్ర హింసలకు గురి చేశాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అనంతరం భార్య భర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా సరే అతనితో కాపురం చేసేది లేదని, తన సోదిరితోనే కలిసి ఉంటానని ఆమె తెగేసి చెప్పింది.












Click it and Unblock the Notifications