Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: అక్రమ సంబంధం మోజులో, విడాకుల కోసం ?, భార్య, వదిన, అత్త, ఐదు మంది సజీవదహనం !

లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్త మద్యంకు బానిస అయ్యాడు. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త భార్యకు నరకం చూపించాడు.అక్క ఇంట్లో ఉన్న భార్యతో గొడవ పెట్టుకుని అందరి మీద పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఐదు మంది సజీవదహనం అయ్యారు

చెన్నై/కడలూరు: యువతి ఓ యువకుడిని ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్త మద్యంకు బానిస అయ్యాడు. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త ఇంటికి వెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు నరకం చూపిస్తున్నాడు. భర్త చిత్రహింసలు తట్టుకోలేక లవ్ మ్యారేజ్ చేసుకున్న మహిళ ఆమె భర్తను వదిలేసి ఆమె అక్క ఇంటికి వెళ్లిపోయింది. తనకు విడాకులు ఇచ్చేయాలని భర్త అతని భార్యకు చెప్పాడు. నీకు విడాకులు ఇవ్వను, నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇవ్వను, ప్రేమించి పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం చేశావని భార్య ఎదురుతిరిగింది. మద్యం మత్తులో ఉన్న భర్త అతని భార్యతో పాటు ఆమె అక్క కుటుంబ సభ్యుల మీద పెట్రోలో పోసి నిప్పంటించేశాడు. పరాయి మహిళ మోజులో, భార్య మీద కోపంతో భర్త చేసిన పనికి ఐదు మంది సజీవదహనం అయ్యారు.

అక్క కాపురం

అక్క కాపురం

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చెల్లంగుప్పం ప్రాంతంలో ప్రకాష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రకాష్ తమిళరసి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రకాష్, తమిళరసి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రకాష్, తమిళరసి దంపతులువ వారి పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. ప్రకాష్, తమిళరసిది పెద్దలు కుదుర్చిన పెళ్లి.

లవ్ మ్యారేజ్ చేసుకున్న చెల్లెలు

లవ్ మ్యారేజ్ చేసుకున్న చెల్లెలు

తమిళరసికి ధనలక్ష్మి అలియాస్ లక్ష్మీ అనే చెల్లెలు ఉంది. మూడు సంవత్సరాల క్రితం సద్గురు అనే వ్యక్తిని ప్రేమించింది. ప్రేమికులు సద్గురు, ధనలక్షి హ్యాపీగా తిరిగారు. తరువాత ధనలక్ష్మి, సద్గురు ప్రేమ వివాహం చేసుకున్నారు. ధనలక్ష్మి, సదర్గురు దంపతులకు 9 నెలల కుమారుడు ఉన్నాడు. కొడుకు పుట్టే వరకు సద్గురు అతని భార్య ధనలక్ష్మితో సంతోషంగానే ఉన్నాడు.

భర్తకు అక్రమ సంబంధం

భర్తకు అక్రమ సంబంధం

కొన్ని నెలల నుంచి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న సద్గురు ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రియురాలి మోజులో పడిపోయిన సద్గురుకు అతని భార్య ధనలక్ష్మి లోకువ అయ్యింది. మద్యం సేవించడానికి అలవాటు పడిన సద్గురు నేరుగా ఇంటికి వెళ్లకుండా ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెతో రొమాన్స్ చేసి మోజు తీర్చుకున్న తరువాత ఇంటికి వెలుతున్నాడు.

భార్యకు నరకం చూపించాడు

భార్యకు నరకం చూపించాడు

మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న సద్గురు మద్యం మత్తులో ఇంటికి వెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని భార్య ధనలక్ష్మికి నరకం చూపించాడు. భర్త సద్గురు చిత్రహింసలు తట్టుకోలేక లవ్ మ్యారేజ్ చేసుకున్న ధనలక్ష్మి ఆమె భర్త సద్గురును వదిలేసి కొడకును పిలుచుకుని ఆమె అక్క తమిళరసి ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నది.

విడాకులు ఇవ్వాలని డిమాండ్

విడాకులు ఇవ్వాలని డిమాండ్

తన భార్య ధనలక్ష్మికి విడాకులు ఇవ్వాలని సద్గురు కోర్టును ఆశ్రయించాడు. విడాకుల పత్రాలపై సంతకం చేయించుకోవడానికి ధనలక్ష్మి నివాసం ఉంటున్న ఆమె అక్క తమిళరసి ఇంటి దగ్గరకు సద్గురు బుధవారం వెళ్లాడు. విడాకులు మీద నేను సంతకం పెట్టను అని ధనక్ష్మి ఎదురు తిరిగటింది. ఆ సమయంలో కోపంతో సద్గురు రగిలిపోయాడు. విడాకుల పత్రాల మీద సంతకాలు చెయ్యాలని మద్యం మత్తులో ఉన్న సద్గురు అతని భార్య ధనలక్ష్మిని చితకబాదేశాడు.

పెట్రోల్ పోసి నిప్పంటించాడు

పెట్రోల్ పోసి నిప్పంటించాడు

విడాకుల పత్రాల మీద సంతకం చేయాలని భార్యను బలవంతపెట్టాడు. కానీ ధనలక్ష్మి తిరస్కరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకానొక సమయంలో సద్గురు సిద్ధంగా వెంట తీసుకెళ్లిన పెట్రోలు డబ్బాను తీసుకుని అతని మీద పోసుకున్నాడు. అనంతరం భార్య ధనలక్ష్మిపై పోశాడు. ఇది చూసి షాక్‌కు గురైన ధనలక్ష్మి సోదరి తమిళరసి, తల్లి సెల్విలు సద్గురును అడ్డుకున్నారు. ఆ సమయంలో సదర్గురు వారి మీద కూడా పెట్రోల్ పోసేసి నిప్పంటించాడు. పక్కనే ఏడుస్తున్న చిన్నారులు లక్ష్మణ్, హాసినిలపై పెట్రోల్ పోసేయడంతో అందరికి మంటలు వ్యాపించాయి.

ఐదు మంది సజీవదహనం

ఐదు మంది సజీవదహనం

అందరికి మంటలు వ్యాపించడంతో సద్గురు ఇంటిలో నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా లోపల లాక్ చేశాడు. చుట్టుపక్కల వాళ్లు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లే సరికి తమిళరసి, ఆమె మూడు నెలల కుమార్తె హాసిన, దనక్ష్మి 9 నెలల కుమారుడు సజీవదహనం అయ్యారు. తీవ్రగాయాలైన సద్గురు, అతని భార్య ధనలక్ష్మి, ఆమె తల్లి సెల్వీలను కడలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై శాడిస్టు సద్గురు, అతని భార్య ధనలక్ష్మి చనిపోయారని గురువారం పోలీసులు అన్నారు. ధనలక్ష్మి తల్లి సెల్వి ప్రాణాలతో పోరాడుతున్నదని పోలీసులు అన్నారు. ఈ గొడవ జరిగే సమయంలో తమిళరసి భర్త ప్రకాష్ బయటకు వెళ్లి ప్రాణాలతో భయపడ్డాడనని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద అక్రమ సంబంధం, విడాకుల గొడవతో భర్త రెచ్చిపోవడంతో ఐదు మంది సజీవదహనం కావడం తమిళనాడులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+