భార్య అశ్లీల ఫోటోలు యూట్యూబ్ లో పెట్టాడు. నా భార్య ఇలాంటిదే చూడండి, విడాకులు!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కుటుంబ గొడవల కారణంగా దూరంగా ఉంటున్న సమయంలో భార్య ఫోటోలను అశ్లీలంగా తయారు చేసిన భర్త వాటిని సోషల్ మీడియాలో పెట్టిన ఘటన బెంగళూరు నగరంలోని కంగేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నా భార్య ఇలాంటిదే మీరు చూడండి అంటూ భర్త ప్రచారం చేశాడు. భార్య ఫిర్యాదు మేరకు అసభ్యంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తి మీద ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

దంపతులు దూరం

దంపతులు దూరం

క్రిష్ణమూర్తి అనే వ్యక్తి యువతిని వివాహం చేసుకుని బెంగళూరులోని కంగేరీలోని విశ్వేశ్వరయ్య లేఔట్ లో నివాసం ఉండేవాడు. అయితే దంపతుల మధ్య అభిప్రాయవిభేదాలు కావడంతో నిత్యం గొడవలు జరిగాయి. భార్యతో తీవ్రస్థాయిలో విభేదాలు కావడంతో క్రిష్ణమూర్తి ఆమెకు దూరం అయ్యాడు.

కోర్టులో కేసు

కోర్టులో కేసు

క్రిష్ణమూర్తి అతని భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉంది. తన భార్య వ్యక్తిత్వం మంచిదికాదని సమాజానికి చాటి చెప్పాలని క్రిష్ణమూర్తి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి.

నా భార్య ఇలాంటిదే !

నా భార్య ఇలాంటిదే !

క్రిష్ణమూర్తి అతని దగ్గర ఉన్న భార్య ఫోటోలు ఫోటోశాప్ లో అశ్లీలంగా తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టాడని తెలిసింది. ఆ అశ్లీల ఫోటోలను బంధువులు, స్థానికులు, స్నేహితులకు చూపించిన క్రిష్ణమూర్తి తన భార్య వ్యక్తిత్వం ఇలా ఉంటుందని, అందుకే విడాకులు తీసుకుంటున్నానని అందర్నీ నమ్మించడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి.

భార్య ఇల్లు లూటీ

భార్య ఇల్లు లూటీ

ఇటీవల తన భర్త క్రిష్ణమూర్తి కంగేరీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ గా పని చేస్తున్న నాగపతి, ఆనంద్ భట్ ను వెంటపెట్టుకుని తన ఇంటిలో చొరబడి దాడి చెయ్యడానికి ప్రయత్నించి రూ. 60 వేలు, మొబైల్ ఫోన్ ఎత్తుకు వెళ్లారని అతని భార్య మంగళవారం కంగేరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యూట్యూబ్ లో ఫోటోలు

యూట్యూబ్ లో ఫోటోలు

కంగేరీ పోలీసులు క్రిష్ణమూర్తి భార్య ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించి విచారణ మొదలుపెట్టారు. క్రిష్ణమూర్తి అతని భార్య ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాడా, పోలీసులను వెంటపెట్టుకుని భార్య ఇంటికి వెళ్లి రూ. 60 వేలు, మొబైల్ లూటీ చేశారా అని ఆరా తీస్తున్నామని కంగేరీ పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Husband had sexually abused his Wifes photos in bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి