సాడిస్ట్ భర్త: అందంగా ఉందని భార్యకు చుక్కలు చూపించాడు..
తాను బయటకు వెళ్తుంటే ఇంటికి తాళం వేసి వెళ్లేవాడు. కూరగాయలు, నిత్యావసర వస్తువులు అన్ని తానే తీసుకొచ్చేవాడు. భార్యను అసలు గడప దాటనిచ్చేవాడు కాదు.
బెంగుళూరు: అందంగా ఉండటమే ఆ ఇల్లాలి పాలిట శాపంగా మారింది. కట్టుకున్నవాడి విపరీత అనుమానాలతో ఆమె నిత్యం నరకం అనుభవించింది. ఒకవిధంగా ఇంటినే జైలులా మార్చేసి ఆమెకు స్వేచ్చ అనేది లేకుండా చేశాడు. ఎట్టకేలకు ఆమె ఆ ఇంటి నుంచి పారిపోయి బయటపడటంతో సదరు భర్త పైశాచికత్వం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరుకు చెందిన వివేక్, శిల్పలకు(పేర్లు మార్చడం జరిగింది) కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదర్చిన వివాహం కాగా.. నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భార్య అందంగా ఉన్నందుకు సంతోషించాల్సింది పోయి.. నిత్యం అనుమానంతో వేధించడమే అతని అలవాటుగా మారింది.

అదే అనుమానంతో శిల్పను ఉద్యోగం మానిపించి ఇంటికే పరిమితం చేశాడు. ఎవరితో మాట్లాడినా విపరీత అర్థాలు తీసి అనుమానించేవాడు. తాను బయటకు వెళ్తుంటే ఇంటికి తాళం వేసి వెళ్లేవాడు. కూరగాయలు, నిత్యావసర వస్తువులు అన్ని తానే తీసుకొచ్చేవాడు. భార్యను అసలు గడప దాటనిచ్చేవాడు కాదు. పుట్టింటివాళ్లతోను ఎక్కువగా ఫోన్స్ మాట్లాడవద్దని బెదిరించాడు.
దీంతో నిత్యం నరకం అనుభవిస్తూ తనలో తానే కుమిలిపోయింది శిల్ప. ఒకరోజు ఆ పైశాచికత్వం మరింత పరాకాష్ట చేరుకుంది. కొడుకును స్కూల్లో చేర్పించి తాను మళ్లీ ఉద్యోగంలో చేరుతానని శిల్ప భర్తను కోరింది. దీంతో మరింత అసహనానికి లోనైన వివేక్.. ఏకంగా ఆమెకు గుండు కొట్టాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపించి అందవిహీనంగా మార్చాలని ప్రయత్నించాడు.
ఇంత నరకయాతన అనుభవిస్తూ ఇక అతనితో కలిసి ఉండటం తనవల్ల కాక.. శిల్ప ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చింది. ఆ తర్వాత తన స్నేహితుల సహాయంతో పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో వివేక్ కు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం శిల్ప పుట్టింట్లోనే ఉంటోంది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications