రీల్ కాదు.. రియల్ స్టోరీ : భార్య కన్యాదానం చేసిన భర్త
వారణాసి : వాళ్లు ప్రేమించుకున్నారు. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకు ఒప్పుకోని కుటుంబసభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. అయినా ప్రియుణ్ని మర్చిపోలేకపోయింది. భర్తకు తెలియకుండా రహస్యంగా అతన్ని కలుసుకోవడం మొదలుపెట్టింది. విషయం తెలిసి భర్త ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తానే కన్యాదాతగా మారి కోరుకున్న వ్యక్తితో భార్య పెళ్లి చేశాడు. సినిమా సీన్‌ను తలపించే ఈ ఘటన యూపీలో జరిగింది.

ఏడాది క్రితం వివాహం
యూపీ వారణాసి పరిధిలోని గర్ఖడా గ్రామానికి చెందిన రాజ్బర్‌కు 2018 మే 21న ఘాజీపూర్‌కు చెందిన యువతితో వివాహమైంది. కొంతకాలం కాపురం సజావుగానే సాగినా.. ఆ తర్వాత భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆరా తీయగా ఆమె పెళ్లికి ముందు వేరే యువకుడిని ప్రేమించిందని, పెళ్లైన తర్వాత కూడా అతన్ని మర్చిపోలేకపోతోందని తెలిసింది. ఆమె తరుచూ ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడటంతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా అతనితో కలిసి తిరుగుతోందని తెలుసుకుని షాక్ తిన్నాడు.

భార్యను మందలించిన భర్త
భార్య ప్రేమాయణం గురించి తెలుసుకున్న రాజ్బర్ భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ప్రియున్ని దూరం పెట్టాలని కోరాడు. అయితే భర్త మాట పెడచెవిన పెట్టిన ఆమె ప్రేమ వ్యవహారం కొనసాగించింది. భర్త హెచ్చరికలను ఏ మాత్రం లెక్కచేయని యువతి శనివారం రాత్రి రాజ్బర్ ఇంట్లోలేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. విషయం తెలుసుకున్న రాజ్బర్ వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

ప్రియుడితో భార్య పెళ్లి
భార్య ఆమె ప్రియుణ్ని బంధించి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలను కూర్చోబెట్టి విషయం చెప్పాడు. తాను తీసుకున్న కఠిన నిర్ణయం గురించి వారికి వివరించాడు. ఎంత చెప్పినా తన మాట వినకుండా, ప్రియున్ని మర్చిలేకపోతున్న భార్యను అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. తొలుత కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పినా ఆ తర్వాత అంగీకరించారు. దీంతో భర్తే స్వయంగా కన్యాదాతగా మారి ప్రియుడితో భార్య పెళ్లి చేసి పంపాడు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications