భార్య చెల్లెలితో భర్త రాసలీలలు.. అడ్డొస్తున్నందుకు హత్య

న్యూఢిల్లీ : వివాహమై రెండు నెలలు కూడా గడవకముందే.. పక్క చూపులు చూడడం మొదలుపెట్టాడో భర్త. భార్య చెల్లెలిపైనే కన్నేసిన అతగాడు, మొత్తానికి ఆమెతో సాన్నిహిత్యం బాగానే పెంచుకున్నాడు. అయితే వీరిద్దరి అక్రమ సంబంధానికి తన భార్య అడ్డుగా ఉండడంతో.. భార్య చెల్లెలితోనే కలిసి ఆమెను హత్య చేశాడు సదరు రాక్షస భర్త.

ఢిల్లీలోని పాలెం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పాలెం ప్రాంతంలో నివాసముండే పూజాకు, రాహుల్ సోలంకికి నెలన్నర రోజుల కిందట వివాహం జరిగింది. పూజాకు రింకీ అనే చెల్లెలు కూడా ఉంది. అయితే ఎలా మొదలైందో తెలియదు గానీ, రాహుల్ కు రింకీకి మధ్య కొద్దిరోజులుగా అక్రమ సంబంధం కొనసాగుతూ వస్తోంది.

Husband Illegal affair with wifes sister leads to her murder

అయితే విషయం కాస్త పూజకు తెలియడంతో.. ఇద్దరినీ నిలదీసింది. దీంతో సంబంధానికి అడ్డుగా ఉన్న పూజను అంతం చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లు గానే.. ఆమె గాఢ నిద్రలో ఉన్న సమయంలో మొహంపై దుప్పటితో ఒత్తిపట్టి ఊపిరాడకుండా చేయడంతో.. పూజ స్పృహ కోల్పోయింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. అనంతరం పోలీసులు దీనిపై విచారణ జరపగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+