పెళ్లైన ఆరు రోజులకే కళ్లెదుట భర్త బలి..ఉగ్రదాడిలో హృదయ విషాద ఘటన
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేవలం ప్రాణనష్టాన్ని మాత్రమే కాదు, ఎన్నో హృదయ విదారక ఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. ఆ దుర్ఘటనలో అల్లంత దూరం నుండి ఆనందం కోసం వచ్చిన వారి కలలు క్షణాల్లో చెదిరిపోయాయి. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి, భవిష్యత్తు అంధకారంలోకి నెట్టింది. కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ రావు తన భార్య, కుమారుడితో కలిసి వెళ్లిన విహారయాత్ర విషాదంగా ముగిసింది. భార్య కళ్ల ముందే భర్త తుపాకీ గుళ్లకు బలవడం అత్యంత హృదయ విదారకమైన సంఘటన. పెళ్లైన ఆరు రోజులకే భర్త తన కళ్లెదుట తుపాకీ గుళ్లకు బలి కావడం ఆ యువతిని శోకసంద్రంలోకి నెట్టింది.
They didn't ask what your caste is.
— Kashmiri Hindu (@BattaKashmiri) April 22, 2025
They didn't ask what language you speak.
They didn't ask which is your state.
All that mattered was that you are a Hindu.#Pahalgam pic.twitter.com/i3rXXDm8iS
ఆ మహిళ చెప్పిన దాని ప్రకారం, ఆమె భర్త పానీ పూరీ తింటున్నప్పుడు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.దుండగుల్లో ఒకరు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే తన భర్తను కాల్చి చంపారని తెలిపింది.కాల్పుల్లో గాయపడిన తన భర్తను కాపాడటానికి సహాయం చేయమని ఆ మహిళ కన్నీటితో వేడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఓ చిన్నారి తన తండ్రిని కోల్పోవడం, ఆ తల్లి తన జీవిత భాగస్వామిని శాశ్వతంగా దూరం చేసుకోవడం తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది.

అలాగే, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పర్యాటకుల పరిస్థితి కూడా అంతే విషాదకరంగా ఉంది. కొందరు తమ జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలను మూటగట్టుకుందామని వస్తే, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వారి కుటుంబాల్లో నెలకొన్న దుఃఖాన్ని వర్ణించలేని స్థితిలో ఉన్నాయి. ఈ దాడిలో గాయపడిన వారి పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. విస్తృతంగా వ్యాపించాయి. ఈ దాడి ప్రత్యేకంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని చేసినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications