Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎదురింటి ఆంటీతో బెడ్ రూంలో రొమాన్స్, పక్క గదిలో భర్త, నగ్నంగా చూసి ఇద్దర్నీ అడ్డంగా నరికేశాడు !

చెన్నై/తుత్తుకుడి: పిల్లలకు పెళ్లి చేసిన ఆమె తన కుమారుడి వయసు ఉన్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త పని మీద బయకు వెళ్లి ఉంటాడని పొరపాటున ఆమె ప్రియుడితో కలిసి బెడ్ రూంలో ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో చప్పుడు కావడంతో పక్క గదిలో ఉన్న భర్త బెడ్ రూంలో నగ్నంగా తన భార్య వేరే యువకుడితో ఉన్న విషయం గుమనించి రగిలిపోయాడు. వెంటనే కొడవలి తీసుకుని బెడ్ రూంలోకి వెళ్లి నగ్నంగా ఉన్న భార్యతో పాటు ఆమె ప్రియుడిని అడ్డంగా నరికి చంపేసి నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు.

రైతుకు ఇద్దరు భార్యలు

రైతుకు ఇద్దరు భార్యలు

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా పశువందన్ సమీపంలోని పుంగవర్ నత్తం గ్రామంలోని అరుంధతి నగర్ లో నివాసం ఉంటున్న షణ్ముగం (58) వ్యవసాయం చేస్తున్నాడు. షణ్ముగం మొదటి భార్యతో మనస్పర్థలు రావడంతో కొన్ని సంవత్సరాల క్రితం మొదటి భార్యతో విడిపోయాడు. తరువాత షణ్ముగం మారియమ్మాళ్ (46) అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

రెండో భార్యతో కాపురం

రెండో భార్యతో కాపురం

షణ్ముగం మొదటి భార్యకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. షణ్ముగం రెండో భార్య మారియమ్మాళ్ కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. షణ్ముగం ఇద్దరు భార్యల కుమారులు, కుమార్తెలు అందరికీ వివాహం కావడంతో అందరూ వేరువేరుగా నివాసం ఉంటున్నారు. షణ్ముగం రెండో భార్య మారియమ్మాళ్ తో కలిసి ప్రత్యేకంగా నివాసం ఉంటున్నాడు.

ఎదురింటి ఆంటీతో లింక్

ఎదురింటి ఆంటీతో లింక్

అరుంధతి కాలనీలో నివాసం ఉంటున్న అవివాహితుడు రామమూర్తి (27) అనే యువకుడు మారియమ్మాళ్ ఇంటి ముందు కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడు. కొత్తగా నిర్మిస్తున్న ఇంటి దగ్గరకు వెలుతున్న రామమూర్తితో మారియమ్మాళ్ తో పరిచయం పెంచుకుని ఆమెకు దగ్గర అయ్యాడు. తరువాత మారియమ్మాళ్, రామమూర్తి పరిచయం అక్రమ సంబందానికి దారి తీసింది.

భర్త బయటకు, ప్రియుడు ఎంట్రీ

భర్త బయటకు, ప్రియుడు ఎంట్రీ

ప్రతి రోజూ పోలం దగ్గర పనులు చేయించడానికి షణ్ముగం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోతాడు. భర్త షణ్ముగం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే మారియమ్మాళ్ ఎదురింటిలో ఇంటి పని చేయిస్తున్న ప్రియుడు రామమూర్తిని తన ఇంటిలోకి పిలిచి అతనితో రాసలీలలు సాగిస్తోంది. ప్రతి రోజూ భర్త షణ్ముగం బయటకు వెళ్లిన వెంటనే మారియమ్మాళ్ ప్రియుడు రామమూర్తితో ఇంటిలోనే కాపురం పెట్టేసింది.

మాయమాటలు చెప్పిన ఆంటీ

మాయమాటలు చెప్పిన ఆంటీ

మారియమ్మాళ్ తన కొడుకు వయసు ఉన్న రామమూర్తితో ఎక్కువ సేపు ఇంటిలో గడుపుతున్నా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి ఎక్కువ అనుమానం రాలేదు. కుమారుడి వయసు ఉన్న రామమూర్తి తన ఇంటికి వచ్చి వెలుతున్నాడని తెలుసుకున్న షణ్ముగం ఏం జరుగుతోంది అంటూ భార్య మారియమ్మాళ్ ను ఆరా తీశాడు. ఏదో పని మీద వచ్చాడని, తాగడానికి నీళ్లు అడిగాడని ఇలా ఏదో ఒకటి చెప్పి ఇంత కాలం మారియమ్మాళ్ తప్పించుకుంది.

 పక్క గదిలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు

పక్క గదిలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు

సాయంత్రం వరకు పోలం పనులతో అలసి పోయిన షణ్ముగం రాత్రి ఇంటికి వెళ్లి భోజనం చేసి నిద్రపోయాడు. ఎప్పటిలాగే వేకువ జామున భర్త షణ్ముగం పోలం దగ్గరకు వెళ్లి ఉంటాడని ఆయన భార్య మారియమ్మాళ్ పొరపాటు పడింది. ఉదయం ఆరు గంటల సమయంలో ఎదురింటిలో ఇంటి పని చేయిస్తున్న ప్రియుడు రామమూర్తిని బెడ్ రూంలోకి రావాలని మారియమ్మాళ్ చెప్పింది. ఆంటీ పిలిచిందని రామమూర్తి వెంటనే వెనుకా ముందు ఆలోచించకుండా ఆమె బెడ్ రూంలోకి దూరిపోయాడు.

 భార్య, ప్రియుడిని నగ్నంగా చూసి భర్త షాక్

భార్య, ప్రియుడిని నగ్నంగా చూసి భర్త షాక్

పక్క గదిలోనే భర్త షణ్ముగం ఉన్నాడని మారియమ్మాళ్ గమనించకుండా ప్రియుడు రామమూర్తితో కలిసి రాసలీలు సాగించింది. ఉదయం నిద్రపోతున్న షణ్ముగం ఎవరో మాట్లాడుకుంటున్నారని మేలుకుని బెడ్ రూం దగ్గరకు వెళ్లి చూశాడు. అంతే బెడ్ రూంలో తన భార్య మారియమ్మాళ్ ప్రియుడు రామమూర్తితో కలిసి నగ్నంగా ఉన్న విషయం గుర్తించిన షణ్ముగం రగిలిపోయాడు. వెంటనే కొడవలి తీసుకుని నగ్నంగా ఉన్న భార్య మారియమ్మాళ్, రామమూర్తి మీద ఇష్టం వచ్చినట్లు నరకడంతో ఇద్దరూ బెడ్ రూంలోనే ప్రాణాలు విడిచారు.

Recommended Video

    Viral Video : Elephants Eating Sugarcane In The Truck, Video Goes Viral | Oneindia Telugu
     నా భార్యకు ఏం పోయేకాలం వచ్చిందో ?

    నా భార్యకు ఏం పోయేకాలం వచ్చిందో ?

    భార్య, ఆమె ప్రియుడిని హత్య చేసిన షణ్ముగం కొడవలి తీసుకుని నేరుగా పశువందనై పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీసుల ముందు లొగిపోయాడు. తన భార్యకు ఏం పోయే కాలం వచ్చిందో ఇలాంటి పని చేసిందని, అందుకే ఇద్దర్నీ కలిసి నరికేశానని షణ్ముగం పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఆంటీ, ఆమె ప్రియుడి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+