దారుణ ఘటన: భార్యను చంపి బావిలో పడేశాడు

పోలీసుల కథనం ప్రకారం.. సోమిదేవి, తన భర్త ఉమేష్ సాయ్ ఉంతపత్తర్ గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. గత కొంతకాలంగా సోమిదేవిని ఉమేష్ అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నట్లు సమాచారం.
కాగా గత రాత్రి సోమిదేవిని హత్య చేసి పక్కనే ఉన్న మరో గ్రామం గోరియారిలోని ఓ బావిలో పడేశాడు తన భర్త ఉమేష్. నిందితుడు ఉమేష్‌పై హత్య, వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు, నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పదేళ్ల బాలికపై అత్యాచారం
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని శోలవరం సమీప గ్రామంలో పదేళ్ల బాలికపై ఆదివారం అత్యాచారం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో బాలికను గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు. బాలికను తనతోపాటు దగ్గరిలోని టీ షాపు వరకు రావాలని కోరగా బాలిక అతని వెంట వెళ్లింది. నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లిన దుండగుడు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
బాలిక అదృశ్యమైందని గుర్తించిన తల్లిదండ్రులు బాలిక కోసం గాలించారు. ఇంటికి కొంత దూరంలోని నిర్జన ప్రదేశంలో బాలికను గుర్తించారు. తనను గుర్తుతెలియని వ్యక్తి ఇక్కడికి తీసుకొచ్చారని, అతని గురించి ఏమి తెలియదని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. అయితే నిందితుడు తన కుటుంబ సభ్యులకు తెలుసని బాలిక చెప్పింది. తన మర్మాంగం వద్ద గాయాలు కావడంతో నడకలేక అక్కడే కూర్చుండిపోయింది.
చికిత్స నిమిత్తం బాలికను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుని గురించి బాలిక సరైన వివరాలు తెలపలేకపోతోందని పోలీసులు చెప్పారు. నిందితుని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications