వివాహేతర సంబంధం: భార్య హత్య, అడవిలో డెడ్‌బాడీ దగ్దం, చిక్కాడిలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ప్రేమించి వివాహం చేసుకొన్న భార్యను హత్య చేసి అడవిలో పూడ్చి పెట్టాడు ఓ భర్త. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది. తమ కూతురు కన్పించడం లేదని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.

భార్యను హత్య చేసిన తర్వాత ఆమె ఫోన్‌తోనే నిందితుడు ఇతర రాష్ట్రాల్లో పర్యటించాడు. అయితే భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.

దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తే అసలు విషయం వెలుగు చూసింది.భార్యపై అనుమానంతోనే నిందితుడు హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.

వివాహేతర సంబంధం నెపంతో భార్యను హత్య చేసిన భర్త

వివాహేతర సంబంధం నెపంతో భార్యను హత్య చేసిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని శాంతినగర్‌లో ఓ హోటల్ నిర్వహించే చంద్రకాంత్ అనే వ్యక్తి అక్షితను పదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు అక్షిత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొంతకాలం పాటు పనిచేసింది ఈ దంపతులకు నాలుగేళ్ళ కొడుకు కూడ ఉన్నాడు. అయితే వీరిద్దరూ తరచూ గొడవపడేవారు. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధ: ఉందని భర్త అనుమానించాడు. దీంతో భార్యను చంపాలని నిర్ణయించుకొన్నాడు.2018 జనవరి 6వ, తేదిన భార్యను చంపేశాడు.

గోనెసంచిలో మహిళ మృతదేహం: బైక్‌పై మృతదేహం తరలింపు, నిందితుల ఫోటోల విడుదల

అడవిలో మృతదేహం కాల్చివేత

అడవిలో మృతదేహం కాల్చివేత

జనవరి 6వ, తేదిన భార్య, భర్తలు గొడవ పడ్డారు. ఈ సమయంలో భార్యను గొంతు నులిమి చంద్రకాంత్ చంపేశాడు. తన స్నేహితుడు రాజ్‌వీర్‌సింగ్‌ సహయంతో అడవి ప్రాంతంలో శవాన్ని పెట్రోల్ పోసి దగ్దం చేశాడు. తమిళనాడు సరిహద్దులో సూలగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కామనదొడ్డి అటవీప్రాంతంలో మృతదేహాన్ని పడేసి డీజిల్‌ పోసి దహనం చేశారు.

షాక్: జల్సాల కోసం వ్యభిచారం చేయాలని భర్త వేధింపులు, హత్యాయత్నం

భార్య ఫోన్‌తో ఇతర రాష్ట్రాల్లో టూర్

భార్య ఫోన్‌తో ఇతర రాష్ట్రాల్లో టూర్

భార్య ఫోన్‌ను తీసుకుని చంద్రకాంత్‌ పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లకు వెళ్లాడు. అయితే అక్షిత తల్లిదండ్రులు చాలాసార్లు తమ కూతురికి ఫోన్ చేశారు. అయితే ఆమె ఫోన్ పనిచేయడం లేదు. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌టవర్ ఆధారంగా పోలీసులు ఫోన్ ఎక్కడుందో గుర్తించారు. భర్త వద్దే ఫోన్ ఉండడంతో పోలీసులు చంద్రకాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.

నిజం ఒప్పుకొన్న చంద్రకాంత్

నిజం ఒప్పుకొన్న చంద్రకాంత్

అక్షితకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని చంద్రకాంత్ పోలీసుల విచారణలో చెప్పాడు. దీనికి తోడు విపరీతంగా మద్యం సేవించేదన్నారు.ఇది భరించలేకే తాను తన భార్యను హత్య చేసినట్టు చంద్రకాంత్ చెప్పాడని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడికి సహకరించిన అతడి స్నేహితుడు రాజ్ వీర్‌సింగ్‌ను కూడ అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A software engineer has killed a wife with family incidents. This horror has come to light lately. In this case, husband Chandrakant and his friend Rajivir Singh were arrested on Saturday by the Sampangi Ramanagara police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి