భర్త నైట్ డ్యూటీకి వెళ్ళగానే , ప్రియుడితో రాసలీలలు,చివరకిలా...

స్నేహితుడు భార్యతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.తమ మద్య బంధం కొనసాగడానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించింది భార్య . ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకొంది.

చెన్నై:స్నేహితుడు భార్యతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.తమ మద్య బంధం కొనసాగడానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించింది భార్య . ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు సమీపంలోని సాలవాక్కం అనే ప్రాంతంలో మురళి తన భార్య వనజ, పిల్లలు విక్రమ్, వినోద్ తో కలిసి జీవనం సాగిస్తున్నాడు.మురళి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

మురళికి ప్రోక్లెయినర్ కూడ ఉంది. ఈ ప్రోక్లెయినర్ ను పెరంబూదూరుకు చెందిన రమేష్ కు మురళి అద్దెకు ఇచ్చాడు. ఈ క్రమంలో రమేష్, మురళి ఇద్దరూ కూడ మంచి స్నేహితులుగా మారారు.

ఈ పరిచయం కారణంగా మురళి ఇంటికి రమేష్ వచ్చేవాడు.అయితే మురళి భార్య వనజనతో రమేష్ కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధాలకు దారితీసింది.

husband murderd by wife with the help of lover

మురళి నైట్ డ్యూటీలకు వెళ్ళినప్పుడు రమేష్ మురళి ఇంటికి వచ్చేవాడు.ఈ విషయాన్ని మురళికి స్థానికులు తెలిపారు. అయితే మురళి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

కాని, ఓ రోజు తన భార్య వద్ద స్మార్ట్ ఫోన్ ను మురళి గుర్తించాడు. ఈ ఫోన్ లో రమేష్ నెంబర్ మినహ ఎవరి నెంబర్లు కూడ లేవు. దీంతో మురళికి కూడ భార్య వనజపై అనుమానం వచ్చింది.

వనజతో పాటు, స్నేహితుడు రమేష్ ను కూడ మురళి హెచ్చరించాడు. తన ఇంటికి రావద్దని రమేష్ ను మందలించాడు. అయితే తమ బందానికి భర్త అడ్డుగా ఉన్నాడని వనజ భావించింది.

దరిమిలా ప్రియుడు రమేష్ తో కలిసి భర్తను హత్య చేయాలని పథకాన్ని రచించింది.ఈ పథకంలో భాగంగానే ఈ నెల 19వ, తేదిన పనిముగించుకొని ఇంటికి వస్తోన్న మురళిని రమేష్ హత్య చేశాడు.

మురళిని హత్య చేసిన విషయాన్ని రమేష్ వనజకు తెలిపింది.అయితే ప్రమాదంలో మురళి మరణించినట్టుగా అందరూ భావించేలా పథకాన్ని రచించి అమలు చేసింది వనజ.

అయితే శవ పరీక్ష లో మురళి తలకు బలమైన గాయం తగలడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పాటుగా స్థానికులు కూడ పోలీసులకు మురళి మరణంలో అనుమానాలు వ్యక్తం చేయడంతో విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం బయటపడింది.

మురళిని హత్య చేసిన తర్వాత తనను రమేష్ వివాహం చేసుకోవడమే కాకుండా పిల్లలను చూస్తానని హమీ ఇచ్చాడని, దీంతో తాను కూడ సమ్మతించానని వనజ చెప్పింది. కిరాయి గుండాలతో రమేష్ మురళిని హత్య చేయించాడని ఆమె వివరించింది.వనజతో పాటు ఆమె ప్రియుడు రమేష్ ను కూడ పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+