ఇంట్లోనే భర్త, ప్రియురాలి కోసం నైటీలో వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు

మహారాష్ట్రలోని పుణేలో ఓ ప్రియుడు మహిళ భర్తకు అడ్డంగా దొరికిపోయాడు.

పుణే: మహారాష్ట్రలోని పుణేలో ఓ ప్రియుడు మహిళ భర్తకు అడ్డంగా దొరికిపోయాడు. ఆసక్తికర విషయమేమంటే భర్త ఇంట్లో ఉండగానే భార్యతో రాసలీలలు నడిపేందుకు సదరు ప్రియుడు వచ్చాడు. ఆ భర్త, ప్రియుడు ఇద్దరు కూడా స్నేహితులు కావడం గమనార్హం.

శుక్రవారం నాడు జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడు రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పుణేలోని బిబ్వేవాడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఓ బంగ్లాలో నివాసముంటున్నాడు. అతనికి రాజేష్ అనే స్నేహితుడు ఉన్నాడు. రాజేష్ పదేపదే అతని ఇంటికి వెళుతుండేవాడు.

pune

అతను లేని సమయంలో కూడా ఇంటికి వచ్చేవాడు. ఆ ఇంటికి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వ్యక్తి ఆమె భర్తకు అసలు విషయం చెప్పాడు. ఇంట్లో లేనప్పుడు రాజేష్ తరుచూ వస్తున్నాడని, మీ భార్యకు అతనితో వివాహేతర సంబంధం ఉందని సెక్యూరిటీ చెప్పాడు.

దీంతో తన ఇంటికి రావొద్దని రాజేష్‌ను ఆ భర్త హెచ్చరించాడు. అయినా అతను మారలేదు. ఇరుగుపొరుగు గుర్తించకుండా ఉండేందుకు ఆడవాళ్లలా దుస్తులు ధరించి రావడం ప్రారంభించాడు.

శుక్రవారం భర్త ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో రాజేష్ ప్రియురాలి వద్దకు వెళ్దామనుకున్నాడు. తనతో పాటు తీసుకెళ్లిన మత్తు మందును నిద్రిస్తున్న ఆమె భర్త ముక్కు వద్ద పెట్టాడు. ఆ మత్తు మందు విపరీతమైన వాసన వచ్చింది. దీంతో మత్తులోకి పోవడం కాకుండా.. మెలకువ వచ్చింది.

భర్త లేచేసరికి నైటీలో ఉన్న వ్యక్తి కనిపించాడు. దీంతో ఆ భర్త రాజేష్‌ను పట్టుకొని అతని ముఖం పైన పిడిగుద్దులు కురిపించాడు. తప్పించుకొని పారిపోయే క్రమంలో ముఖానికి ఉన్న మాస్క్ పోయింది. అతనిని రాజేష్‌గా గుర్తించిన సదరు భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి మధ్య ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+