లోన్ తీర్చలేక భార్య న్యూడ్ వీడియోలు, నగ్న వీడియో కాల్స్ తో డీల్, ఏడాదికే !

బెంగళూరు/మంగళూరు: అప్పు చేసిన యువకుడికి ఆ రుణం తిరిగి చెల్లించే శక్తి లేదు. అప్పు తిరిగి చెల్లించమని రుణం ఇచ్చిన వాళ్లు అడగడంతో అతను ఓ కొత్త ఐడియా వేశాడు. అప్పు మాఫీ చేయాలని, లేదంటే రుణం తిరిగి చెల్లించే తేదీని వాయిదా వేయాలని అతని భార్యతో నగ్నంగా వీడియో కాల్స్‌ చేయిస్తూ అప్పు ఇచ్చిన వాళ్లతో మాట్లాడించాడు. భర్త వేధింపులు పెరగడంతో అతని భార్య స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేరళలోని కాసరగూడు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన నీలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది, యువతికి వివాహం అయ్యి సంవత్సరం కూడా పూర్తి కాలేదు. పెళ్లి అయిన కొన్ని నెలలకే ఆమెకు భర్త సినిమా చూపించాడు. కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు పాలా ఏరియా సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు.

Husband sharing nude videos of wife unable to pay off debt near Mangaluru

ఈ మహిళ భర్త గ్రామం చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. అప్పు తీర్చమని రుణం ఇచ్చిన వాళ్లు అడిగితే మళ్లీ ఆ దారిలోకి వెళ్లకుండా తప్పించుకుని తిరిగాడు. అప్పు ఇచ్చిన వాళ్లు ఫోన్ చేస్తే వారి ఫోన్ కాల్ రిసీవ్ చెయ్యకుండా తప్పించుకుని తిరిగాడు. అప్పు ఇచ్చిన వాళ్లు యువకుడు నివాసం ఉంటున్న చోటకు వెళ్లి అతని భార్యను బెదిరించడం మొదలు పెట్టారు.

అప్పుల భారం పెరగడంతో యువతి భర్తకు కొత్త ఆలోచన వచ్చింది. అప్పు తిరిగి చెల్లించాలని అడిగిన వారితో భార్యను పడుకోబెట్టాలని ప్రయత్నించాడు. రుణం ఇచ్చిన వ్యక్తులు అప్పు తిరిగి చెల్లించమని కోరినప్పుడు మీ కోరికలు తీరుస్తాను, నన్ను డబ్బులు అడగకూడదని చెప్పాడు. భార్యను బెదిరించి ఆమెను నగ్నంగా తయారు చేసి అప్పు ఇచ్చిన వారితో వీడియో కాల్ చేయించి ఆమెతో మాట్లాడించడం మోదలు పెట్టాడు.

Husband sharing nude videos of wife unable to pay off debt near Mangaluru

ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని అడగకూడదని, మీకు సూపర్ ఫిగర్ తో ఎంజాయ్ చేసే అవకాశం ఇస్తానని, నా భార్యతో ఒంటరిగా వీడియో కాల్స్ చేయిస్తానని, ఉచితం మీకు బాడీ మసాజ్‌ చేయిస్తానని అప్పు ఇచ్చిన వాళ్లకు భర్త చెప్పాడు. ఈ సేవలు అన్ని మీకు కావాలంటే తనకు ఇచ్చిన అప్పు మాఫీ చేయాలని భర్త బేరం పెట్టాడు.

ఇప్పటికే భార్యను బెదిరించి ఆమెతో నగ్నంగా చాలా మందితో మాట్లాడించిన భర్త శాడిస్టు లాగా ప్రవర్తించాడు. భార్య ఎదురుతిరిగితే ఆమెను చితకబాదేశాడు. భర్త వేధింపులు పెరగడంతో అతని భార్య నీలేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇప్పుడు విచారణ ప్రారంభించారు.

Husband sharing nude videos of wife unable to pay off debt near Mangaluru
భార్య ఫిర్యాదు చేయగా ఆమె భర్త కనిపించకుండా పోయాడని, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని పోలీసులు అన్నారు. పెళ్లి అయ్యి ఏడాది కూడా పూర్తి కాకుండా భర్త టార్చర్ తో అతని భార్య నరకం అనుభవించిందని కాసరగూడు పోలీసు అధికారులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో చాలా జరిగాయని పోలీసు అధికారులు అంటున్నారు.

ఇటీవల మంగళూరులో తాను పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అని నమ్మించి అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. యువతి న్యూడ్ ఫోటోలు తీసి వైరల్ చేస్తానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన యువకుడిని మహిళా ఠాణా పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచూరుకు చెందిన యమనూరు బాబు అరెస్టు అయిన నిందితుడు. వీధినాటకాలు వేస్తున్న యమనూరు బాబు తాను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నానని ఓయువతి నమ్మించేందుకు డ్రామాలో వేసుకుంటున్న పోలీస్ ఎస్‌ఐ డ్రెస్‌ను ఉపయోగించి ఆమె మీద అత్యాచారం చేశాడని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+