lovers: 20 రోజుల ముందు పెళ్లి, ఉరి వేసుకున్న భర్త, గొంతు కోసుకున్న భార్య, మిడ్ నైట్ ఎంట్రీతో గొడవ !

చెన్నై/ కన్యాకుమారి/ తిరుపూర్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి ఉండాలని డిసైడ్ అయిన ప్రేమికులు 20 రోజుల క్రితం పెళ్లి చేసుకుని హ్యాపీలైఫ్ కు పునాది వేశారు. అయితే దంపతుల మద్య అప్పుడే ఏదో జరిగింది. అంతే జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆవేదన చెందిన నవవధువు గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పెళ్లి జరిగి నెల రోజులు కాకముందే ప్రేమికులు దారుణానికి పాల్పాడటంతో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు షాక్ అయ్యారు. భర్త రోజూ మిడ్ నైట్ ఎంట్రీతో గొడవలు ఎక్కువైనాయని తెలిసింది.

 షార్ట్ ఫిలిమ్స్ ఫోటోగ్రాఫర్

షార్ట్ ఫిలిమ్స్ ఫోటోగ్రాఫర్

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ లోని కొట్టారు ప్రాంతంలోని జీవానగర్ కు చెందిన విష్ణు అనే యువకుడు షార్ట్ ఫిలిమ్స్ కు ఫోటో గ్రాఫర్ గా పని చేస్తున్నాడు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లాకు చెందిన షాలినికి, విష్ణుకు పరిచయం అయ్యింది. విష్ణు, షాలిని ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొంతకాలం విష్ణు, షాలిని కలిసి తిరిగారు.

 పెళ్లికి గ్నీన్ సిగ్నల్

పెళ్లికి గ్నీన్ సిగ్నల్

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన షాలిని, విష్ణు వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈనెలలోనే కేవలం 20 రోజుల క్రితం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో విష్ణు, షాలిని పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న షాలిని, విష్ణు జీవితాంతం కలిసి ఉండాలని ఇరు కుటుంబ సభ్యులు వారిని ఆశీర్వదించారు.

తాళిబొట్టు తెంచిపారేసిన షాలిని

తాళిబొట్టు తెంచిపారేసిన షాలిని

పెళ్లి జరిగిన వారం రోజుల్లోనే షాలిని, విష్ణు దంపతుల మద్య గొడవ మొదలైయ్యింది. నవదంపతులు రాత్రిపూట సరసాలు ఆడుతున్నారని వారి కుటుంబ సభ్యులు మొదట పెద్దగా పట్టించుకోలేదు. గొడవలు రోజురోజుకు పెద్దవి కావడంతో శుక్రవారం పెద్దలు పంచాయితీ చేసి షాలిని, విష్ణులకు నచ్చచెప్పారు. ఆ సమయంలో మళ్లీ గొడవపడిన షాలిని తాళిబొట్టు తెంచి భర్త విష్ణు ముఖం మీద విసిరికొట్టి నీతో కాపురం చెయ్యనని తేల్చి చెప్పింది.

 గూబ పగలగొట్టిన భర్త

గూబ పగలగొట్టిన భర్త

పెళ్లి జరిగి 20 రోజులు కాకముందే అందరి ముందు తాళిబొట్టు తెంచి ముఖం మీద కొట్టడంతో సహనం కోల్పోయిన విష్ణు పెద్దల ముందే భార్య షాలిని గూబ పగిలేలా చెంప మీద కొట్టాడు. తరువాత వెంటనే ఇంట్లోకి వెళ్లిన విష్ణు ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. కొంత సమయానికి బంధువులు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే విష్ణు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 గొంతు కోసుకున్న భార్య

గొంతు కోసుకున్న భార్య

భర్త విష్ణుఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళన చెందిన షాలిని వంట గదిలోకి వెళ్లి తలుపు లాక్ చేసి కత్తితో గొంతు కోసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు షాలినిని అసరిమల్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షాలిని గొంతు ఎక్కువగా తెగిపోవడంతో ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

 భర్త మిడ్ నైట్ ఎంట్రీతో గొడవ

భర్త మిడ్ నైట్ ఎంట్రీతో గొడవ

రాత్రిపూట ఏ విషయంలో దంపతుల మద్య గొడవలు జరిగాయో పెద్దగా బయటకు తెలీలేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు. విష్ణు పెళ్లి జరిగినా ప్రతిరోజూ అర్దరాత్రి ఇంటికి వెళ్లేవాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న 20 రోజుల్లోనే ఇలా జరగడంతో రెండు కుటంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+