బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'బర్త్ డే' రోజు భార్యను ఫ్లాట్ చేయాలని!: ఆమె కోసం ఊహించని గిఫ్ట్..

కేవలం 24గం.ల్లో భార్య కోసం 2,400అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించి బహుమతిగా ఇవ్వనున్నాడు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పిండి కొద్ది రొట్టె అన్నట్లు.. బడ్జెట్ కొద్ది 'బర్త్ డే'లు. మధ్య తరగతి జీవులైతే.. నలుగురు మిత్రులు.. నాలుగు గోడల మధ్య పుట్టినరోజు హంగామా ముగుస్తుంది. అదే హైఫై ఫ్యామీలీల్లో పుట్టినరోజులంటే.. కనీసం జిల్లా పేపర్లో అయినా దాని గురించి గొప్పగా అచ్చవ్వాలి.

ఇలాగే తన భార్యకు ఊహించని గిఫ్ట్ ఇవ్వాలని భావించిన ఓ భర్త.. ఇందుకోసం వినూత్నంగా ఆలోచించాడు. కేవలం 24గం.ల్లో భార్య కోసం 2,400అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించి బహుమతిగా ఇవ్వనున్నాడు. సాధారణంగా అయితే ఓ ఇంటి నిర్మాణానికి కనీసం నాలుగైదు నెలలైనా పడుతుంది. కానీ ఫ్రీ కన్ స్ట్రక్షన్ విధానంలో ఒక్క రోజులో ఈ కల సాధ్యమే అంటున్నారు.

husband surprise gift for wife on her birthday

బెంగుళూరుకు చెందిన కాఫీ ఉత్పత్తుల వ్యాపారి త్యాగ్ ఊతప్ప భార్య కోసం ఈ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఫ్రీ కన్‌స్ట్రక్షన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా, సాంప్రదాయ పద్దతిలో 2,400అడుగుల విస్తీర్ణంలో మూడు పడక గదుల నిర్మాణానికి సుమారు రూ.75లక్షలు ఖర్చయితే, ఫ్రీ-కన్‌స్ట్రక్షన్ విధానంలో కేవలం రూ.48లక్షల్లోనే ఇంటి నిర్మాణం పూర్తవతుందంటున్నారు.

గతంలో ఇదే తరహా పద్దతిలో పంజాబ్ లోని మొహాలీలో కేవలం 48గంటల్లో 10అంతస్తుల భవనాన్ని నిర్మించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోను ఇది చోటు సంపాదించుకుంది. ఈ తరహా విధానంలో ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే గోడలు, స్లాబు, తదితర వాటిని ముందే కాంక్రీట్ తో సిద్దం చేసి ఉంచుతారు. ఆ తర్వాత ఇంటిని నిర్మించే ప్రాంతానికి వాటిని తరలించి.. అప్పటికప్పుడు నిర్మాణం చేపడుతారు. దీని ద్వారా వ్యయభారం తగ్గుతుందని ఫ్రీకాస్ట్ కన్ స్ట్రక్షన్ నిపుణుడు మేనన్ తెలిపారు.

English summary
A husband was planned to give a different type of gift to his wife on her birthday. He approached a company which is builds houses on 24hours only
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X