ఆ పని చేసిందని 10వ భార్యను కిరాతకంగా చంపిన భర్త.. మిగతా తొమ్మిది మంది ?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జాష్‌పూర్ జిల్లా సులేసా గ్రామానికి చెందిన ధూలారామ్ పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అతని వయస్సు ప్రస్తుతం 38 ఏళ్లు కానీ ఇప్పటికే పది వివాహాలు చేసుకున్నారు. ఇప్పుడు 10వ భార్య ఆ పని చేసిందని దారుణంగా హత్య చేశాడు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ధూలారామ్ ప్రవర్తన నచ్చక భార్య వెళ్ళిపోవడం జరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు అలా తొమ్మిది మంది వెళ్లిపోయారు. ప్రస్తుతం బసంతి బాయి అనే మహిళను అతడు 10వ భార్యగా పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలంగా వారి మధ్య అనుబంధం బాగానే ఉంటుంది. ఏప్రిల్ 16వ తేదీన ఈ జంటను బంధువుల పెళ్లికి ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి బాగిచా అనే ప్రాంతానికి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేడుకల్లో పాల్గొన్నారు. కానీ సాయంత్రానికి ఎవ్వరూ ఊహించని విధంగా బసంతి బాయి దొంగతనానికి పాల్పడింది.

కొత్త బట్టలు, పప్పులు, బియ్యం, వంట నూనె వంటి నిత్యావసరాలను దొంగలించి అక్కడి నుంచి పరారైంది. ఆ దొంగతనం చూసిన కొందరు అక్కడ ఉన్నవారికి విషయం చెప్పారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ధూలారామ్‌కి ఈ విషయం తెలియదు. కానీ ఇతరులు అతడిని ప్రశ్నించడంతో అతడు అవమానంగా భావించి అక్కడి నుంచే వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే తన భార్యను వెతుకుతూ ఓ అడవిలో ఉన్నట్టు తెలుసుకున్నాడు.
ఇక వెంటనే అక్కడికి వెళ్లి ఆమెను నిలదీశాడు ధూలారామ్. ఇద్దరి మధ్య మాటలు పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో కోపానికి గురైన ధూలారామ్, బసంతిపై విచక్షణరహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపరచడంతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో ధూలారామ్ ఆమెను అక్కడే వదిలేసి, ఎండిన ఆకులు, చెత్తను ఆమెపై కప్పి పరారయ్యాడు. అయితే సుమారు ఐదు రోజులు గడిచిన తర్వాత ఆ ప్రాంతం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానంతో ఆ దిశగా వెళ్లారు.
ఈ స్థితిలోనే కుళ్లిపోయిన మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలో దొరికిన మొబైల్ ఫోన్ ఆధారంగా మృతి చెందింది బసంతి అని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధూలారామ్‌ను సైతం అదుపులోకి తీసుకొని విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. భార్య దొంగతనం చేసిందనే కోపంతో హత్య చేసినట్టు వెల్లడించాడు. ఈ క్రమంలోనే ధులారామ్ గతం గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications