మోడల్ సూసైడ్‌లో ట్విస్ట్: పబ్‌లకు వెళ్లడం నచ్చలేదు, వెంటపడి పెళ్లి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన మోడల్ ప్రియాంక చావ్లా కేసులో తాజాగా మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ప్రియాంకను సంతోషంగా చూసుకుంటానని, ఆమె ఆనందంగా ఉండేలా చేస్తానని ప్రామిస్ చేసి, ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడని ఆమె స్నేహితులు, బంధువులు విమర్శిస్తున్నారు.

ప్రియాంక చాలా ఫ్రెండ్లీ వ్యక్తి అని, ఆమెకు పెద్ద సోషల్ సర్కిల్ ఉండేదని, కానీ నితిన్‌తో పరిచయం అయ్యాక ఆమె పూర్తిగా మారిపోయిందని, ఫేస్‌బుక్ తెరవడం మానేసిందని, చివరికి తన ఫోన్ నెంబర్ కూడా మార్చేసిందని ఆమెతో కలిసి పలు ఈవెంట్లు నిర్వహించిన జకీ అనే వ్యక్తి చెబుతున్నాడు.

మేం చాలా పార్టీల్లో పాల్గొన్నామని, సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్‌లో ఉండేవారమని, ఆమె ఆత్మహత్య తెలుసుకొని షాకయ్యానని వెడ్డింగ్ ప్లానర్ రమణీక్ తెలిపారు.

ప్రియాంక అందరితో కలివిడిగా ఉండటం ఆమె భర్త నితిన్‌కు నచ్చలేదని, అదే వారి మధ్య గొడవకు కారణమైందని తెలుస్తోందని అంటున్నారు.

ప్రియాంక పార్టీల సమయంలో కొత్త ఉత్సాహాన్ని నింపేదని, చాలామంది పురుష స్నేహితులు ఉన్నారని, అది ఆమె భర్తకు నచ్చలేదని, మొదట డేటింగ్ చేసి, ఆ తర్వాత ప్రియాంకను పెళ్లాడాడని, పెళ్లి తర్వాత తన భార్య పని చేయడం నచ్చడం లేదని, అతని తీరు తమను ఆశ్చర్యపరిచిందని చెబుతున్నారు.

Husband who promised to keep Delhi model happy beat her mercilessly

వెంటబడి పెళ్లి చేసుకున్నాడు

ఆమె వెంటబడ్డాడని, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఆనందంగా చూసుకుంటానని చెప్పి, మంచి జీవితాన్ని ఇస్తానని చెప్పి పెళ్లికి ఒప్పించాడని, కానీ తీరా ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడని ఆరోపిస్తున్నారు.

ప్రియాంక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. పదేళ్ల కొడుకును కలిగిన నితిన్ చావ్లా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, గత జనవరి నెలలో ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. ప్రియాంక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

తొమ్మిది నెలల పాటు వెంటాడి, ప్రేమిస్తున్నానని వేధించి, ఒప్పించి పెళ్లి చేసుకున్నాడని చెబుతున్నారు. ఆమె చుట్టూ నితిన్ తిరిగాడని, పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని ఆమె అమ్మ కాళ్ల మీద పడ్డాడని చెబుతున్నారు. ఆమెను సంతోషంగా చూసుకుంటానని చెప్పాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ పెళ్లయ్యాక అతని స్వరూపం బట్టబయలు అయిందని ప్రియాంక సోదరి డింపీ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+