పరువు, ప్రతిష్ట: నవదంపతుల ఆత్మహత్య
చెన్నై: ప్రేమ వివాహం చేసుకున్న నవదంపతులు ఆర్థిక సమస్యల కారణంగా జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తిరునిండ్రవూర్ లోని సుదేశీనగర్ లో నివాసం ఉంటున్న సురేష్ (23), ప్రవీణ (20) ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పారు.
సురేష్ ఆన్ లైన్ వ్యాపార సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రవీణ ఓ ప్రయివేట్ కాలేజ్ లో బీకాం చదువుతున్నది. వీరిద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో ప్రవీణ కుటుంబ సభ్యులు పెళ్లి చెయ్యడానికి నిరాకరించారు.
సురేష్ తల్లిదండ్రులు చనిపోవడంతో అతను తన అక్క జ్యోతిలక్ష్మి దగ్గర పెరిగాడు. ప్రవీణ పెద్దలను ఎదిరించి జులై 3వ తేదిన ఓ గుడిలో సురేష్ ను వివాహం చేసుకుంది. ఇద్దరు వేరుగా కాపురం పెట్టారు.

జ్యోతిలక్ష్మి తమ్ముడి ఇంటికి వెళ్లింది. ఇంటి తలుపులు తీసి ఉండటంతో లోపలికి వెళ్లింది. హాల్ లో సురేష్ లుంగీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి గట్టిగా కేకలు వేసింది.
చుట్టుపక్కల వారు వచ్చి బెడ్ రూం తలుపులు పగలగొట్టి చూడగా ప్రవీణ చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. ఆర్థిక సమస్యల కారణంగా నిత్యం దంపతులు గొడవపడేవారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. పెద్దలను ఆశ్రయిస్తే పరువు పోతుందని భావించి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications