Viral Video: మన హైదరాబాద్ vs పాకిస్థాన్ లోని హైదరాబాద్.. వీడియో చూస్తే నవ్వు ఆగదు..!

భారత్ లో హైదరాబాద్ మహా నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. హైదరాబాద్ జనాభా కోటీ 20 లక్షల మంది వరకు ఉన్నారు. అలాగే భారత్ లోని మెట్రో నగరాలైన ముంబై, దిల్లీ, బెంగళూరు తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టాప్ ప్లేస్ లో దూసుకెళ్తోంది. ఇక్కడ గ్లోబల్ దిగ్గజ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ఫేస్ బుక్ తదితర సంస్థలు భాగ్యనగరం ఖ్యాతిని ప్రపంచ చిత్ర పటంలో నిలుపుతున్నాయి. అంతేకాక మెర్సర్ అంతర్జాతీయ సర్వేల ప్రకారం భారత్ లోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ అనేకసార్లు అగ్రస్థానంలో నిలిచింది.

Hyderabad India vs Pakistan Viral Video Sparks Massive Online Discussion Hyderabad Pakistan India

అయితే హైదరాబాద్ పేరుతో పాకిస్థాన్ లోనూ ఓ నగరం ఉంది. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియా అధికమైన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ లోని హైదరాబాద్ vs ఇండియాలోని హైదరాబాద్ వ్యత్యాసాన్ని వివరిస్తూ ఎక్స్ లో ఓ యూజర్ పోస్ట్ పెట్టారు. ఇప్పుడా పోస్టు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. పాకిస్థాన్ లోని హైదరాబాద్ ఇంకా 1980 నాటి కాలంలో మాదిరిగానే ఉందని.. ఇండియాలోని హైదరాబాద్ మాత్రం ఇప్పుడే 2080 నాటి కాలంగా విరాజిల్లుతోందని పోస్టు పెట్టారు. ఈ ఫన్నీ పోస్ట్ చూసిన నెటిజన్లు ఛీఛీ.. మీతో పోలికేంట్రా అని కామెంట్స్ పెడుతున్నారు.

మరికొంతమంది పాకిస్థాన్ లోని హైదరాబాద్ జనాభా కేవలం 10 లక్షలేనని.. ఇండియాలోని హైదరాబాద్ జనాభా దాదాపు 2 కోట్లని మరో యూజర్ కామెంట్ పెట్టాడు. హైదరాబాద్ అభివృద్ధిని వివరిస్తూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. అయితే హైదరాబాద్ లోనూ ఇలాంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయని ఇంకో యూజర్ అన్నాడు. పాతబస్తీలో చాలా ప్రాంతాలు ఇలాగే ఉంటాయని అన్నాడు. మరో యూజర్ కామెంట్ పెడుతూ.. హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.. మొత్తం పాకిస్థాన్ కంటే రిచ్చెస్ట్ అని తెలిపాడు. మరికొంతమంది మాత్రం హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ఇంకా అలాగే ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మీరూ ఈ వీడియోపై ఓ సారి లుక్కేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+