Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లిఫ్ట్‌లో సహోద్యోగినిపై అత్యాచారం: హైదరాబాదీ అరెస్టు

పానాజీ: ఆరు నెలల క్రితం సహోద్యోగినిపై తలేగావోలోని లిఫ్ట్‌లో అత్యాచారం చేశాడనే ఆరోపణపై పానాజీ పోలీసులు మామిళ్లపల్లి సంతోష్ కుమార్‌ను అరెస్టు చేశారు. అనతు కాండోలిమ్‌లోని ఓర్డాలో నివాసం ఉంటున్నాడు. కాగా, అతను హైదరాబాదుకు చెందినవాడు.

చెత్తను తీసేద్దామని సాకుతో తనకు పర్యవేక్షుడిగా పనిచేసిన నిందితుడు 2014 మార్చిలో తనను లిఫ్ట్‌లోకి తీసుకుని వెళ్లి నిర్బంధించి, తనపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది. రెండు సార్లు బలవంతంగా తనతో లైంగిక సంపర్కం జరిపినట్లు ఆమె ఆరోపించింది. ఈ విషయం బయటకు చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో చెప్పింది.

Hyderabad native arrested for raping his employee

కడుపులో నొప్పి వస్తుందని బాధితురాలు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన సోదరితో కలిసి ఆమె డాక్టర్‌ను సంప్రదించింది. తనకు ఆరు నెలల గర్భమని పరీక్షల్లో తేలిందని బాధితురాలు చెప్పింది. విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+