హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drug mafia: రియా దెబ్బకు రకుల్ ప్రీత్ కు చెమటలు, ఆరోజు నీతులు, ఈ రోజు......మేడమ్ అంతే వైరల్ !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ హైదరాబాద్: బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి NCB అధికారులు లోతుగా విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారని తెలిసింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రిచా చక్రవర్తి అనేక మంది బండారం బయటపెట్టిందని సమాచారం. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR)మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి సుమారు 25 మంది పేర్లు అధికారుల విచారణలో బయటపెట్టిందని తెలిసింది. బహుబాష నటి రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు సారా ఆలీ ఖాన్ తదితరుల పేర్లు రియా చక్రవర్తి చెప్పిందని సమాచారం. ఎన్ సీబీ అధికారుల జాబితాలో లేని పేర్లు విచారణలో వెలుగు చూడటంతో అధికారులు ఆకోణంలో విచారణ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరమీదకు రావడంతో 2017 హైదరాబాద్ లో తీసిన ఆమె ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Drug racket: నన్ను బకరా చేసి సంకనాకించేశారు, సంజనా ఫైర్, గ్యారెంటీ లేదు, నాతల్లే, నంగనాచి !Drug racket: నన్ను బకరా చేసి సంకనాకించేశారు, సంజనా ఫైర్, గ్యారెంటీ లేదు, నాతల్లే, నంగనాచి !

 లిస్ట్ లో పేరు లేదు... కాని ?

లిస్ట్ లో పేరు లేదు... కాని ?

బాలీవుడ్, ముంబాయి డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న ఎన్ సీబీ అధికారుల జాబితాలో ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదని సమాచారం. అయితే డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయ్యి ముంబాయిలోని బైకుల్లా జైల్లో ఉంటున్న బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారం మేరకు రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి.

 మేడమ్ దెబ్బకు మటాష్

మేడమ్ దెబ్బకు మటాష్

పేరులో చక్రవర్తి ఉన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటి రియా చక్రవర్తి పరిస్థితి మరీదీనంగా ఉంది. బైకుల్లా మహిళా సెంట్రల్ జైల్లో సాధారణ ఖైదీలతో పాటు రియా చక్రవర్తి కాలం గడుపుతోంది. అయితే పోలీసు అధికారుల విచారణలో ఏకంగా 25 మంది పేర్లు చెప్పిన రియా చక్రవర్తి చేతులు దులుపుకుందని సమాచారం. మేడమ్ రియా చక్రవర్తి దెబ్బకు ఇప్పుడు అనేక మంది సెలబ్రిటీల గుండెల్లో ఎక్స్ ప్రెస్ రైళ్లు పరిగెడుతున్నాయి.

 రకుల్ ఫోటోలు, వీడియోలు వైరల్

రకుల్ ఫోటోలు, వీడియోలు వైరల్

టాలీవుడ్ ను రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఊపు ఊపేస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా టాలీవుడ్ టాప్ హీరో అందరితో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. 2017లో హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఓ అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సందర్బంలో నేటి యువతతో పాటు ప్రతిఒక్కరు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జోరుగా ప్రచారం చేశారు. ఆ రోజు రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఫోటోలు, వీడియో నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 ఇంటర్వూలో మాకు నీతులు.. మీకు మాత్రం ?

ఇంటర్వూలో మాకు నీతులు.. మీకు మాత్రం ?

రకుల్ ప్రీత్ సింగ్ ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్లూలో సైతం డ్రగ్స్ కు అందరూ దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని, మనం ప్రతిరోజు వ్యాయామం చెయ్యాలని సలహా ఇచ్చారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన ఇంటర్వూ వీడియో ఇప్పుడు తెరమీదకు వచ్చింది. మేడమ్ ఆరోజు మాకు నీతులు చెప్పి ఈ రోజు మీరు డ్రగ్స్ దందా కేసుల్లో చిక్కుకుంటున్నారా ? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

 రకుల్ ప్రీత్ కు ఎన్ సీబీ నోటీసులు ?

రకుల్ ప్రీత్ కు ఎన్ సీబీ నోటీసులు ?

బాలీవుడ్ వయ్యారిభామ రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారం మేరకు ఎన్ సీబీ అధికారులు అనేకకోణాల్లో విచారణ చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ కు డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయని ముంబాయి మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత నటి రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మరికొందరు నోటీసులు ఇవ్వాలి ? అని ఎన్ సీబీ అధికారులు భావిస్తున్నారని సమాచారం. మొత్తం మీద రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారంతో ఆమె అభిమానులు అయోమయంలో పడిపోయారు.

English summary
Drug mafia: Hyderabad Police promoted #SayNoToDrugs with Rakul Preet Singh in 2017. now, this picture went to viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X