హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏం దుస్తులు అమ్మాయి.. స్లీవ్‌లెస్‌పై ఖాకీల కస్సుబుస్సు.. మరో ఉద్దేశం అంటోన్న హైదరాబాదీలు

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు సాంప్రదాయ బద్దంగా ఉండటం రేర్.. అదీ ఇండియాలో కూడా.. ఏదో పల్లెటూరు తప్పించి.. మిగతా చోట్ల అంతా కామనే.. అంటే వెస్ట్రన్ వేర్ కాకున్నా.. కురచ దుస్తులు.. స్లీవ్ లెస్ కామన్ అయపోయింది. అయితే హైదరాబాదీ యువతులకు హఠాత్ పరిణామం ఎదురయ్యింది. అదీ కూడా పుదుచ్చేరిలో సిచుయేషన్ ఎదుర్కొన్నారు. వారు కురచ దుస్తులతో పుదుచ్చేరి వీధుల్లో తిరుగుతున్న సమయంలో అక్కడి పోలీసులు అడ్డుకున్నారు.

పబ్లిక్ ప్లేసుల్లో..

పబ్లిక్ ప్లేసుల్లో..

పబ్లిక్ ప్లేసుల్లో ఇలాంటి బట్టలు ధరిస్తారా అని పోలీసులు క్లాస్ పీకారు.హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న కొందరు యువతులు సరదాగా గడిపేందుకు పుదుచ్చేరి వెళ్లారు. స్థానిక ఫ్రెంచ్ కాలనీలో తిరుగుతున్న ఆ యువతులను ఇద్దరు పోలీసులు వెంటాడారు. ఇంతలో యువతుల వద్దకు వచ్చిన ఒక పోలీస్ కానిస్టేబుల్.. వారిలో ఒకరి ఫోన్ నెంబర్‌తోపాటు ఇతర వివరాలు నమోదు చేశారు. యువతుల వేషధారణ గురించి అడిగారు. ఇలాంటి బట్టలు వేసుకుని వీధుల్లోకి రావొద్దని సూచించారు.

ఏం తప్పు ఉంది..

ఏం తప్పు ఉంది..

తమ వేషధారణలో ఏం తప్పు ఉందో చెప్పాలని ఆ యువతులు ఎదురు ప్రశ్నించారు. ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులకు కూడా ఇలాంటి ఆంక్షలే చెబుతున్నారా? తమకు మాత్రమేనా? అంటూ యువతులు పోలీసులను ప్రశ్నించారు. ఇదీ మంచి పద్ధతి కాదన్నారు. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న తమపై పోలీసుల ప్రవర్తన సరిగా లేదని యువతులు ఆరోపించారు. ఆ ఇద్దరు పోలీసులు వేరే ఉద్దేశంతో తమను అడ్డుకున్నారని వాపోయారు. నిలదీసే సరికి వేరే కారణం చెప్పారని తెలిపారు.

కంప్లైంట్ వచ్చింది.. అబ్బే అదేం లేదు

కంప్లైంట్ వచ్చింది.. అబ్బే అదేం లేదు

యువతులు కురచ దుస్తులు ధరించారని ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలిపారు. స్కూల్ పరిసర ప్రాంతాలు కాబట్టి ఇలాంటి దుస్తులు ధరించడానికి వీల్లేదని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. కానీ యువతుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. పోలీసులు తమను వక్రదృష్టితో చూశారని.. అందుకే ఇలాంటి కబుర్లు చెబుతున్నారని కామెంట్ చేశారు. ఎక్కడ తాము ఆరోపణలు చేస్తామనే భయం వారిని వెంటాడుతుందని తెలిపారు. అందుకే ఇలా తమను దుస్తుల పేరుతో అడ్డుకున్నారని.. అడ్రస్, పేరు, ఫోన్ నంబర్ అడిగారని చెప్పారు. ఇదీ మంచి పద్దతి కాదని.. తమపై నెపం వేయడం అంత మంచిది కాదన్నారు.

English summary
hyderabad software employees wear sleeveless at puducherry. local police are objection but women are alleges cops for another engle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X