Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గర్భవతైన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్త.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటన..

హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. 20ఏళ్ల యువతికి ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. పెళ్లి అనంతరం ఢిల్లీలో కాపురం పెట్టిన ఆ జంట కొన్నాళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత భర్త అసలు రూపం బయటపడింది. కట్నం కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఇంతలో యువతి గర్భవతి అయింది. వేధింపులు ఆగకపోగా ఇంకా ఎక్కువయ్యాయి.

యువతి తల్లిదండ్రులను నుంచి కారు తీసుకుని రావడంతో పైటు ఓ ఇల్లు కొనివ్వమని అడగాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. అందుకు ఆమె నిరాకరించడంతో చేయి చేసుకున్నాడు. తన మాట విననందుకు గొడ్డును బాదినట్లు బాదాడు. ఒకసారి తనను హత్య చేసే ప్రయత్నం చేశాడని చెప్పాడు. మూడు నెలల క్రితం ఒక రోజు ఇంటికి వచ్చిన భర్త పేపర్‌పై ట్రిపుల్ తలాక్ చెప్పి అదే విషయాన్ని పేపర్‌పై రాసి ఇచ్చినట్లు చెప్పింది.

Hyderabad woman alleged that she was given triple talaq by her husband

ఈ వారంలోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. భర్త ట్రిపుల్ తలాక్ ఇవ్వడంతో సదరు మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమెకు అహ్మదాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆమె అత్తింటి వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+