అవును ఏజెంట్‌నే: శివసేన కసబ్ వ్యాఖ్యలపై కులకర్ణి
ముంబై: తనను పాకిస్తాన్ ఏజెంట్‌గా, కసబ్‌కు మరో రూపంగా శివసేన అభివర్ణించడంపై సుదీంధ్ర కులకర్ణి మంగళవారంనాడు స్పందించారు. తాను భారత్, పాకిస్తాన్ మధ్య శాంతికి ఏజెంట్‌ను అని, పార్టీ భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించానని ఆయన అన్నారు.
తాను ఈ రోజు సామ్నా చదివానని, దాని భావప్రకటనా స్వేచ్ఛను తాను గౌరవిస్తున్నానని, రాజకీయ పార్టీకి అధికారిక పత్రిక అయిన సామ్నా భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తున్నానని ఆయన అన్నారు. తనను సామ్నా ఏజెంట్‌గా అభివర్ణించిందని, తాను దక్షిణాసియా దేశాల మధ్య శాంతికి ఏజెంట్‌ను అని ఆయన మీడియాతో అన్నారు.

శివసేన కూడా ఇతరుల భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని, తమతో ఏకీభవించని వారి పట్ట అవమానకరంగా ప్రవర్తించకూడదని ఆయన అన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న విభేదాలను తొలగించడానికే తాను పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి కుర్షీద్ మహ్మూద్ పుస్తకావిష్కరణను ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు.
మన ప్రధాని బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దక్షిణాసియా దేశాల మధ్య అనుబంధం పెంచడానికి ప్రయత్నిస్తున్నారని, రష్యాలో నవాజ్ షరీప్‌ను కలిసి అవగాహనకు వచ్చారని, పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలని భారత్ ప్రయత్నిస్తోందని దాన్ని బట్టి అర్థమవుతోందని ఆయన అన్నారు .
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications