వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లికి ముందే, నేను సంజయ్ గాంధీ కూతుర్ని: ప్రియాసింగ్ సంచలనం

దివంగత కాంగ్రెస్ నేత, ఇందిరాగాంధీ కొడుకు సంజయ్‌గాంధీ తన తండ్రి అని సంచలన ప్రకటన చేసింది ప్రియాసింగ్‌ పాల్ అనే 48ఏళ్ల మహిళ. విడుదలకు రెడీ అయిన బాలీవుడ్ చిత్రం ‘ఇందూ సర్కార్‌'లో తన తండ్రి చరిత్రకు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దివంగత కాంగ్రెస్ నేత, ఇందిరాగాంధీ కొడుకు సంజయ్‌గాంధీ తన తండ్రి అని సంచలన ప్రకటన చేసింది ప్రియాసింగ్‌ పాల్ అనే 48ఏళ్ల మహిళ. విడుదలకు రెడీ అయిన బాలీవుడ్ చిత్రం 'ఇందూ సర్కార్‌'లో తన తండ్రి చరిత్రకు వక్రభాష్యం చెప్పారని ఆరోపించారు ప్రియాసింగ్‌.

సినిమాలో అన్నీ అబద్ధాలే..

సినిమాలో అన్నీ అబద్ధాలే..

సినిమాలో 30 శాతం నిజాలుంటే, 70 శాతం అబద్ధాలున్నాయని ఆమె అన్నారు. ఈ విషయమై మూవీ డైరెక్టర్‌ మధుర్ భండార్కర్‌కి లీగల్‌ నోటీసులు సైతం పంపానని మీడియాకు తెలిపారు.

సంజయ్ పెళ్లికి ముందే..

సంజయ్ పెళ్లికి ముందే..

తాను 1968లో పుట్టానని, తనను చిన్నప్పుడే 1974లో షీలాసింగ్- బల్వంద్‌ పాల్‌ దంపతులు దత్తత తీసుకున్నారని తెలిపారు. పెళ్లికాక ముందు సంజయ్‌కు జన్మించిన కూతురినని ఈ విషయాన్ని తన పెంపుడు తల్లిదండ్రులు చెప్పినట్టు వివరించారు.

పేరు కోసం కాదు..

పేరు కోసం కాదు..

తాను పేరు ఇలాంటి ఆరోపణలు చేయడం లేదని, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకేనని ప్రియాసింగ్ స్పష్టం చేశారు. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సోదరి విమలా గుజ్రాల్ ద్వారా తనకు తాను ‘సంజయ్ గాంధీ రక్తం పంచుకుపుట్టిన కూతురు'ననే విషయం తెలిసినట్లు తెలిపారు.

స్పందించన రాలేదు..

స్పందించన రాలేదు..

అయితే, ఈ విషయంపై కాంగ్రెస్ గానీ, గాంధీ కుటుంబం గానీ ఇప్పటివరకు స్పందించలేదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడైన సంజయ్ గాంధీ.. మేనకా గాంధీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

మేనకా, వరుణ్

మేనకా, వరుణ్

మేనకా గాంధీ ప్రస్తుతం కేంద్రమంత్రిగా పనిచేస్తున్నారు. సంజయ్-మేనకాల కుమారుడు వరుణ్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి లోకసభసభ్యులుగా ఉన్నారు. కాగా, ఇందూ సర్కార్ చిత్రానికి మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించగా, భరత్ షా నిర్మాతగా వ్యవహరించారు. అంతేగాక, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లాజ్ నిహాలానీ ఈ చిత్ర విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

English summary
A political controversy was triggered on Monday after a woman, Priya Singh Paul (48), alleged that she was the biological daughter of late Congress leader Sanjay Gandhi and granddaughter of former Prime Minister Indira Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X