Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేను బీజేపీకి ఐటమ్ గర్ల్‌ని: అజామ్ ఖాన్ సంచలనం, ‘అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు’

లక్నో: ఎప్పుడే ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజామ్ ఖాన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను బీజేపీకి ఐటమ్ గర్ల్‌గా మారానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండేళ్ల క్రితం ఘజియాబాద్‌లో హజ్‌హౌస్ ప్రారంభోత్సవానికి హాజరైన అజామ్ ఖాన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. దీంతో అంబేద్కర్ మహాసభ సభ్యులు.. అజామ్ ఖాన్‌పై మంగళవారం హజ్రత్‌గని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

I am the item girl of BJP: Azam Khan after FIR for alleged remarks against BR Ambedkar

ఈ విషయంపై అజామ్ ఖాన్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ గత ఎన్నికల్లో తన పేరే వాడిందని, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కూడా తన పేరునే అడ్డుపెట్టుకుని ప్రచారం చేయాలని భావిస్తోందని అన్నారు.

ఎందుకంటే, బీజేపీ నన్ను తన ఐటమ్ గర్ల్‌గా భావిస్తోందని అజామ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇక మీదట కూడా తనకు సమన్లు, వారెంట్లూ వస్తూనే ఉంటాయని అజామ్ ఖాన్ అన్నారు. తనపై ఎన్ని కేసులు నమోదయ్యాయో కూడా తనకు తెలియదని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+