దావూద్ ఇబ్రహీం డీ కంపెనీలో విభేదాలు, ఛోటా షకీల్ క్లారిటీ, పాక్ ఇంటెలిజెన్స్ !
న్యూఢిల్లీ/కరాచి: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం డీ కంపెనీలో విభేధాలు వచ్చాయన్న వార్తలపై అతని కుడి భుజం ఛోటా షకీల్ తాజాగా స్పందించాడు. దావూద్ ఇబ్రహీంతో తనకు ఎటువంటి విభేధాలు లేవని, ఆఖరి శ్వాస వరకూ దావూద్ భాయ్ తోనే ఉంటానని ఛోటా షకీల్ స్పష్టం చేశాడు.

డీ కంపెనీ కోసం !
అండర్ వరల్డ్ కింగ్ దావూద్ ఇబ్రహీం భాయ్ డీ కంపెనీ కోసమే చివరికి తాను పని చేస్తానని ఛోటా షకీల్ స్పష్టం చేశాడని వెలుగు చూసింది. దావూద్ ఇబ్రహీంతో వచ్చిన విభేధాల వల్ల ఛోటా షకీల్ మరో మాఫియా సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుంటున్నాడని ఇంటలిజెన్స్ వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

దావూద్ ఇబ్రహీంతో !
దావూద్ ఇబ్రహీంతో తనకు గొడవలు వచ్చాయని చెప్పడం కేవలం పుకార్లు మాత్రమేనని ఛోటా షకీల్ అంటున్నాడు. తన చివరి శ్వాస వరకూ డీ కంపెనీ కోసమే పనిచేస్తానని, మరో మాఫియా సామ్రాజ్యం ఏర్పాటు చెయ్యనని ఛోటా షకీల్ చెప్పాడు.

రహస్య ప్రాంతంలో !
ఛోటా షకీల్ ఓ రహస్య ప్రాంతం నుంచి జీ న్యూస్ టీవీ చానల్ కు ఈ విషయాన్ని ఫోన్ లో చెప్పాడు. అదే సమయంలో నేను భాయ్‌తో ఎప్పటిలాగే ఉంటున్నాను. ఇకముందు ఆయనతోనే ఉంటాను అంటూ ఛోటా షకీల్ చెప్పాడు. డీ కంపెనీలో దావూద్ ఇబ్రహీంకు ఛోటా షకీల్ కుడి భుజంగా ఉంటున్నాడు.

దావూద్ ఇంటి నుంచి మాయం ?
దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ తో చోటా షకీల్ కు విభేదాలు రావడంతో అతను కరాచిలోని దావూద్ ఇబ్రహీంకు చెందిన క్లిఫ్టన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని బుదవారం ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు పలువురిని తప్పుదొవపట్టించడానికి ఇలా చెప్పి ఉంటుందని ఛోటా షకీల్ అంటున్నాడు.

అనీస్ vsఛోటా షకీల్ !
మాఫియా సామ్రాజ్యం డీ కంపెనీలో దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ పాత్ర రోజురోజుకూ పెరగడంతో ఛోటా షకీల్ దావూద్ ఇబ్రహీంకు దూరమయ్యాడని బుధవారం వార్తలు వచ్చాయి. అదే సమయంలో దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్‌ను కలిపేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని వెలుగు చూసింది. మొత్తం మీద ఛోటా షకీల్ తాను దావూద్ ఇబ్రహీం వెంటే ఉన్నానని చెప్పడం కొసమెరుపు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications