అందుకే దుస్తులిప్పేస్తానని చెప్పా: ఆ సీక్రెట్ చెప్పిన పూనం పాండే
ముంబై: ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే తాజాగా ఆసక్తికర విషయం వెల్లడించింది. అయిదేళ్ల క్రితం 2011లో టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే నగ్నం ప్రదర్శన చేస్తానని నాడు ఎందుకు చెప్పానో పూనమ్ తాజాగా వెల్లడించింది. తనకు పేరు వచ్చేందుకే అలా చేశానని అసలు విషయం తెలిపింది.
ఆ సమయంలో తనకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదని, అలాగే తాను కపూర్ కుటుంబం నుంచో లేక ఖాన్‌ల కుటుంబం నుంచో రాలేదని, కానీ తాను కష్టపడి పని చేస్తానని పేర్కొంది. ఈ స్థితికి తాను రావడానికి తన కష్టపడేతత్వమే కారణమని చెప్పింది.

అప్పట్లో తాను ఎవరికీ తెలియదని, కాకపోతే తనకంటూ ఓ గుర్తింపు కోరుకున్నానని చెప్పింది. తన దృష్టిలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినపుడే తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అవుతామని చెప్పింది. అందుకే ఆ ప్రకటన చేశానని, దాంతో తాను అనుకున్నట్లుగానే గుర్తింపు వచ్చిందని చెప్పింది.












Click it and Unblock the Notifications