చిన్నారులతో డేరాబాబా సెక్స్: ఆ ఆస్పత్రిలో గర్భస్రావాలే అధికం
Recommended Video

సిర్సా: డేరాబాబా రామ్ రహీమ్ సింగ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దేవుడి పేరుతో డేరా బాబా అనేక దాష్టీకాలు విచారణలో బయటకు వస్తున్నాయి. మహిళలనే కాదు , స్కూల్ పిల్లలపై కూడ రామ్ రహీమ్ బాబా లైంగిక వేధింపులకు పాల్పడేవాడని విచారణలో వెలుగుచూసింది. బాబా వేధింపులకు గురైన వారిలో చాలా మందికి వివాహలు కూడ జరిగాయని గతంలో ఆశ్రమంలో పనిచేసి గురుదాస్ సింగ్ టూడ్ చెప్పారు.
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో రామ్‌రహీమ్ సింగ్‌కు 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది సిబిఐ కోర్టు. ఈ ఏడాది ఆగష్టు 25వ, తేదిన రామ్ రహీమ్ సింగ్‌ను శిక్ష విధించింది కోర్టు. దీంతో రామ్ రహీమ్ సింగ్ జైలు జీవితం గడుపుతున్నారు.
డేరా సచ్ఛా సౌధలో కోర్టు ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. బాబా బెడ్‌రూమ్ నుండి అమ్మాయిల గదుల్లోకి రహస్య సొరంగమార్గాలను ఏర్పాటుచేసుకొన్నారు బాబా. గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు ఆశ్రమంలో దొరికాయని విచారణాధికారులు ప్రకటించారు.
తనకు నచ్చిన అమ్మాయిలను డేరా బాబా లైంగికంగా వేధింపులకు గురిచేసేవాడని విచారణలో తేటతెల్లమైంది. అయితే ఆశ్రమంలో డేరాబాబా మరో ప్రపంచాన్ని చూపేవాడు. 800 ఎకరాల్లో డేరా బాబా తనకు నచ్చినట్టుగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు.

స్కూల్ విద్యార్థులపై డేరా బాబా లైంగిక వేధింపులు
రాసలీలల గురువు డేరాబాబా అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సాధ్వీలపైనే కాదు.. అన్నెంపున్నెం ఎరుగని స్కూల్ చిన్నారులపైనా గుర్మీత్ రాంరహీం సింగ్ దాష్టీకాలకు పాల్పడ్డారని వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా డేరాలో ఇదివరకు పనిచేసిన గురుదాస్ సింగ్ టూడ్ మంగళవారం బయటపెట్టారు. డేరా పాఠశాలలో 10మంది బాలికలను రాంరహీం లైంగికంగా వేధించారన్నారు. బాధితులంతా తనకు తెలుసని.. వారిలో చాలామందికి పెళ్లిళ్లు కూడా అయ్యాయన్నారు. వారిలో చాలామందితో రాంరహీం టచ్‌లో ఉండేవారని అన్నారు. అటు బాధితుల్లో ఓ మహిళ.. ఈ విషయాలను ధ్రువీకరించడం విశేషం. ప్రస్తుతం పెళ్లిచేసుకొని అమెరికాలో స్థిరపడిన సదరు మహిళ.. తాను డేరా బడిలో ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో రాంరహీం తనతో జుగుప్సాకరంగా ప్రవర్తించేవాడని వాపోయింది.

తల్లిదండ్రులు నమ్మలేదు
డేరాబాబా తన పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని తల్లిండ్రులకు చెప్పుకున్నా వారు నమ్మలేదని బాధితురాలు గుర్తుచేశారు. తర్వాత ఎన్నోసార్లు.. వారు బాబాను దర్శించుకున్నారని, రాంరహీం జైలుపాలైనా.. ఇప్పటికీ వారు డేరాబాబాకు భక్తులేనని బాధితురాలు చెప్పింది. తాను ఇటీవలే స్వదేశానికి వచ్చిమరీ మూఢభక్తి నుంచి బయటకురావాలని వేడుకున్నానని ఆమె గుర్తుచేసుకొన్నారు.

బాబాపై ఫిర్యాదు చేస్తే ఇంటినుండి వెళ్ళగొట్టారు
డేరాబాబా లైంగిక వేధిపులకు గురిచేస్తున్నారనే విషయాన్ని చెబితే తల్లిదండ్రులు నమ్మకపోగా తనను ఇంటి నుండి వెళ్ళిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు.బాధితురాలు కన్నీళ్ళు పెట్టుకొంది. ఈ విషయాలన్నీ ఆమె టూడ్‌తో వాట్స్‌పలో పంచుకోవడం గమనార్హం.

ఆ ఆసుపత్రిలో గర్భస్రావాలే అధికం
డేరాబాబా నిర్వహించే ఆస్పత్రిలో రోగులకు చికిత్సకన్నా బాలికల గర్భస్రావాలే ఎక్కువ జరిగేవని టూడ్ చెప్పారు. డేరా సభ్యుడిగా స్వయంగా మూడు అబార్షన్లు జరగడాన్ని చూశానన్నారు. చిన్నారులపై బాబా చేసిన దాష్టీకాలపై కోర్టులో కేసులో వేస్తానని ఆయన చెప్పారు. మరోవైపు డేరా బాబా దత్తపుత్రికగా చెప్పుకొన్న హనీప్రీత్ కోసం వెతుకున్న పోలీసులు పురోగతి సాధించారు. ఫోన్ నంబరు ఆధారంగా ఆమె రాజస్థాన్‌లో ఉన్నట్టుగా గుర్తించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications