స్కూలంటే పరమ బోరు, బాలీవుడ్ నటి కరీనా
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కరీనా కపూర్ తాను సగటు విద్యార్దిని అవడం వల్లనే చిన్నతనంలో పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టం ఉండేదికాదని అన్నారు. 33 సంవత్సరాల వయసున్న కరీనా కపూర్ భారత్‌లో ఎడ్యుకేషన్ చొరవ కోసం యునిసెఫ్ బ్రాండ్ సెలబ్రిటీగా పని చేస్తున్నారు. చిన్నప్పుడు ముందు బెంచిలో కూర్చోకపోవడం వల్ల ఉపాధ్యాయలు దృష్టి తనపై పెద్దగా ఉండేదికాదన్నారు.
'మా అమ్మ స్కూలుకి వెళ్లేందుకు నన్ను ప్రొద్దునే 6 గంటలకు లేపేది. కానీ నేను మాత్రం ఒక్కో గంట పడుకుంటా అని చెప్పేదాన్ని అని' అన్నారు. 'నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మోయలేనన్ని పుస్తకాలతో నా స్కూల్ బ్యాగ్ బరువుగా ఉండేది. సగటు విద్యార్దిని కావడంతో నేను తరగతి గదిలో నిద్రపోయేదాన్ని. ముందు వరుసలో కూర్చున్న వారిపై ఉపాధ్యాయుల శ్రద్ద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ నేను వెనుకనే కూర్చునేదాన్ని. ఇంకా చెప్పాలంటే నేను ఇంట్లోనే ఉండి చదువుకుంటాను, లేదంటే సినిమా చూస్తానని' అన్నారు.

న్యూఢిల్లీలో చైల్డ్ ఫ్రెండ్లీ స్కూల్స్ అండ్ సిస్టమ్స్ (CFSS)ప్యాకేజిని ప్రవేశపెట్టిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని పిల్లలు అందరి విద్య అందాలనేది తమ ఉద్దేశమని అన్నారు. యునిసెఫ్ వారితో రాజస్దాన్‌లో ఉన్న చైల్డ్ ప్రెండ్లీ స్కూల్స్‌ని కరీనా కపూర్ సందర్శించారు. 'ఈ సంవత్సరం మొదట్లో ఆ స్కూల్‌ని సందర్శించడం అనుభూతి. 33 వయసులో ఉన్న నాకు అక్కడున్న అబ్బాయిలు, అమ్మాయిలు ముఖాలు చూడగానే మళ్లీ స్కూలుకి వెళ్లాలని అనిపించిందని' అన్నారు.
చైల్డ్ ప్రెండ్లీ స్కూల్స్‌లో ఉన్న ఉపాధ్యాయులు పిల్లలు పట్ల ప్రత్యేక శ్రద్దను కనబరుస్తున్నారని అన్నారు. స్కూలు విద్యాభ్యాసాన్ని ముంబైలో చేశానని, చదువు చాలా ముఖ్యమన్నారు. 'చదువుకోవడం వల్ల జ్ఞానం, ధైర్యం వస్తుందని, భారతదేశంలో అద్భుతమైన ప్రగతి పిల్లలు కోసం విద్యా రంగంలో జరిగిందని, కానీ మనకున్న ప్రధాన సమస్య నాణ్యమైన విద్య లేకపోవమే. పాఠశాలలో అనేక పిల్లలు ఉన్నారు కానీ సరిగ్గా నేర్చుకోకపోవడం వల్ల అవసరమైన దృష్టిని పొందలేకపోతున్నారనిట' అన్నారు. తల్లిలాగే టీచర్ కూడా చాలా ముఖ్యమన్నారు.
యునిసెఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా తర్వాత ఉత్తరప్రదేశ్, భోపాల్, ఛండీఘడ్‌లలో ఉన్న చైల్డ్ ప్రెండ్లీ స్కూల్స్‌ను సందర్సించనున్నట్లు తెలిపారు.
-
66 ఏళ్ల వయసులో ఆ నటి తల్లి కాబోతుందా ??? -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం












Click it and Unblock the Notifications