త్రిబుల్ షూటర్ తో విభేదాలు లేవు , ఇద్దరూ కాంగ్రెస్: ఆయనతో పని చేస్తున్నా, మంత్రి జారకిహోళి !

బెంగళూరు: ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టికి చెందిన వారే అని, కలిసి కట్టుగా పని చేసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి సతీష్ జారకిహోళి శనివారం బెళగావిలో మీడియాకు చెప్పారు.

తనకు డీకే. శివకుమార్ ల మద్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సతీష్ జారకిహోళి అసహనం వ్యక్తం చేశారు. డీకే శివకుమార్ ఉత్తర కర్ణాటక భాగం ఇన్ చార్జ్ గా భాద్యతలు స్వీకరించడానికి తాను ఎప్పుడు వ్యతిరేకించలేదని మంత్రి సతీష్ జారకిహోళి స్పష్టం చేశారు.

I do not have any political difference with DK Shivakumar, says Karnataka minister Satish Jarkiholi.

డీకే శివకుమార్ కు ఉత్తర కర్ణాటక భాగం ఇన్ చార్జ్ మంత్రిగా భాద్యతలు అప్పగించరాదని తాను ఎక్కడా చెప్పలేదని, ఆయనకు ఆ పదవి ఇస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు. డీకే. శివకుమార్ నాయకత్వంలో తాను పని చేశానని, ఇక ముందు పని చేస్తానని మంత్రి సతీష్ జారకిహోళి వివరించారు.

దక్షిణ కర్ణాటక భాగం వారికి ఆ ప్రాంతం ఇన్ చార్జ్ మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చెయ్యడంలో అర్థం లేదని మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్నవారికి, సమర్థంగా పని చేసే వారికి భాద్యతలు అప్పగిస్తారని మంత్రి సతీష్ జారకి హోళి అన్నారు.

తాను, డీకే శివకుమార్ ఒకే వేదిక మీద ఉన్నా మాట్లాడుకోలేదని తప్పుడు ప్రచారం జరిగిందని, ఇద్దరూ మాట్లాడుకున్నామని మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు. డికే శివకుమార్ నాయకత్వంలో తాను పని చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని, లేనిపోని వారే మా మద్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సతీష్ జారకిహోళి ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+