ప్రధాని మోడీకి చెంచానే, ఇబ్బంది లేదు: అనుపమ్‌ఖేర్
ముంబై: తాను ప్రధాని నరేంద్ర మోడీకి చంచాను అని చెప్పే వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోనని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ శనివారం నాడు అన్నారు. దేశం కోసం శ్రమిస్తున్న ప్రధాని మోడీకి తనను చెంచాగా పేర్కొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశం కోసం ప్రధాని మోడీ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. అలాంటి మోడీకి చెంచాగా పేర్కొనడాన్ని పట్టించుకోనని స్పష్టం చేశారు. మోడీని కీర్తిస్తూ పాఠశాలల్లో బాలబాలికలు ఎందుకు నినాదాలు చేయడం లేదు? మాజీ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రిపై వారు నినాదాలు చేస్తున్నారు కదా. మరి సమస్యేంటని ప్రశ్నించారు.

ప్రధాని మోడీ రాత్రనక పగలనక శ్రమిస్తున్నారు. దేశ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా పెంచుతున్నారన్నారు. కొందరైతే ఆయన చేసే ప్రతిపనిలో రంధ్రాన్వేషణలు చేస్తూ కిందకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గొప్ప ప్రధానికి చెంచాగా సంబోధించడం తనకు సమ్మతమేనన్నారు.












Click it and Unblock the Notifications