వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు న‌చ్చ‌వు: నితిన్ గ‌డ్క‌రీ

|
Google Oneindia TeluguNews

కేంద్ర ర‌హ‌దారుల‌శాఖ మంత్రి, భార‌తీయ జ‌న‌తాపార్టీ సీనియర్ నేత నితిన్‌ గడ్కరీ త‌న మ‌న‌సులో ఏదీ ఉంచుకోరు. ఏదైనావున్నా సూటిగా చెప్పేస్తుంటారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా త‌న అనుభ‌వాల‌ను ఇత‌రుల‌తోను, మీడియాతోను పంచుకుంటుంటారు. తాజాగా నాగ్‌పూర్‌లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో గ‌డ్క‌రీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒక పాత విష‌యాన్ని పంచుకున్నారు. త‌న స్నేహితుడు ఒక‌రు కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ స‌ల‌హా ఇచ్చార‌ని వెల్ల‌డించారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరడం కంటే బావిలో దూకడం మంచిదని చెప్పాన‌ని, ఆ పార్టీ సిద్ధాంతాలు త‌న‌కు న‌చ్చ‌వ‌ని నితిన్ వెల్ల‌డించారు. త‌న‌కు స‌ల‌హా ఇచ్చిన స్నేహితుడి పేరు శ్రీకాంత్ జిచ్కార్ అని చెప్పారు. ఎవరినీ సొంత ప్రయోజనాల‌కు ఉపయోగించుకొని వదిలేయకూడదని, అటువంటి ప‌రిస్థితి రేపు మ‌న‌కు కూడా ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. మనం ఒకరి చేతిని పట్టుకున్నామంటే దానిని ఎప్ప‌టికీ వ‌ద‌ల‌కూడ‌దు అనేదే అర్థ‌మ‌ని వివ‌రించారు.

I dont like that partys ideologies: Nitin Gadkari

బీజేపీకి చెందిన పార్ల‌మెంట‌రీ బోర్డు నుంచి గ‌డ్క‌రీని తొల‌గించిన త‌ర్వాత ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకుంటున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు బోర్డులో ఏడుగురు స‌భ్యులు ఉండ‌గా ఆ సంఖ్య 11కు పెరిగింది. రానున్న కాలంలో న‌రేంద్ర‌మోడీ త‌ర్వాత ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి నితిన్ గ‌డ్క‌రీయే అర్హుడ‌ని, రేపటి ఎన్నిక‌ల్లో మెజారిటీ రాక‌పోతే విప‌క్షాల‌తోపాటు స్వ‌ప‌క్షంలోనే కొంత‌మంది మోడీకి మ‌ద్ద‌తు ప‌లికే అవ‌కాశం ఉండ‌ద‌ని, గ‌డ్క‌రీవైపు మొగ్గుచూపుతార‌ని, అందుకే ముందుగానే ఆయ‌న్ను బోర్డు నుంచి సాగ‌నంపారంటూ వార్త‌లు వ‌చ్చాయి.

English summary
Union Minister of Roads and senior leader of Bharatiya Janata Party Nitin Gadkari does not keep anything in his mind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X