అత్యాచారానికి గురయ్యా: ఫ్రెండ్‌కు పంపాలనుకుంటే డ్రైవర్‌కే చేరింది

న్యూఢిల్లీ: తాను అత్యాచారానికి గురయ్యానని బాధితురాలు తన ప్రెండ్‌కు మెసేజ్ పంపితే అది నిందితుడైన క్యాబ్ డ్రైవర్‌కే వెళ్లింది. తనను రోడ్డుపై శివకుమార్ యాదవ్ పడేసి వెళ్లిపోయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ తనను రేప్ చేశాడంటూ బాధితురాలు ఫ్రెండ్‌కు మెసేజ్ పంపించాలని అనుకుంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం - ఆ మెసేజ్ అది లాస్ట్ కాలర్‌కు వెళ్లింది. ఆ లాస్ట్ కాల్ డ్రైవర్‌ది. యాదవ్ తన ఫోన్ నుంచి మహిళ నెంబర్‌కు ఫోన్ చేసి, ఇంటి వద్ద దింపుతానని చెప్పినట్లు సమాచారం. దాంతో అదే లాస్ట్ కాల్ అయింది. పోలీసులకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అతను బాధితురాలిని బెదిరించాడు. అయినా కూడా ఆమె మెసేజ్ పంపించింది. దీంతో ఆమె విషయాన్ని పోలీసులకు చెబుతుందనే ఆందోళన డ్రైవర్‌లో చోటు చేసుకుంది.

మహిళ ఫ్రెండ్‌కు పంపించాలని అనుకున్న మెసేజ్ తనకు రావడంతో శివ కుమార్ యాదవ్ భయపడిపోయి తన కుటుంబంతో నేపాల్ పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే, ఆదివారం అతను పోలీసులకు చిక్కాడు. తన నేరానికి యాదవ్ ఏ మాత్రం పశ్చాత్తాపపడడం లేదని పోలీసులు అంటున్నారు. మహిళ నిద్రపోవడంతో, కారును పార్కు చేసి అత్యాచారం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడని పోలీసులు చెబుతున్నారు.

'I Have Been Raped,' She Texted, Mistakenly to Driver

దాంతో ఆమెకు మెలుకువ వచ్చిందని, అప్పుడు యాదవ్ బాధితురాలి గొంతు పట్టుకుని చప్పుడు చేస్తే ఇనుప రాడ్ దూరుస్తానని బెదిరించాడని, 2012 డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ సామూహిక అత్యాచార సంఘటనను గుర్తు చేశాడని పోలీసులు చెప్పారు.

శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27ఏళ్ల మహిళ క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పనిచేస్తోంది.

మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు. కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది.

ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+