350 మంది అమ్మాయిలతో లింక్, అయితే ఏం?: అంబరీష్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తనకు విరుద్ధంగా అధిష్టానానికి లేఖ రాయడం, శాసనసభలో ఫోన్ చూస్తూ కాలం గడపడంపై వచ్చిన విమర్శలకు మంత్రి అంబరీష్ నిర్లక్ష్యంగా సమాదానం ఇచ్చారు. ఇది వివాదానికి దారి తీస్తోంది. ఈ రెండు విషయాలపై స్పందించాల్సిందిగా సువర్ణ విధానసౌధాలో మీడియా అంబరీష్‌ను కోరగా ‘నేను హీరోను. నాకు ఒక ప్రైవేటు లైఫ్ ఉంటుంది. తాగుతాను, డ్యాన్స్ చేస్తాను. 350 మంది అమ్మాయిలతో తిరిగాను.(350 హుడిగిర జొత ఓడాడిద్దేనే)" అని అన్నారు.
అదంతా వ్యక్తిగత వ్యవహారమని ఆయన అన్నారు. శాసనసభలో మొబైల్ ఫొన్ వాడటంపై కూడా ఆయన మాట్లాడారు. ఎవరో తనకు వారి ఫోన్ సరిగా పనిచేయడం లేదని చూపిస్తే ఫోన్‌ను తాకానని, దానికే రాద్దాంతమా? అని, అయినా ఈ వయసులో చూడటానికి ఏమి ఉంటుందని నవ్వుకొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తన ఫోటోను రాహుల్ గాంధీకి పంపించాలనుకుంటే పంపించవచ్చునని, తనకు ఏ ఇబ్బందీ లేదని, ఆ పని తాను సభలో చేయలేదని, అది తన వ్యక్తిగత జీవితమని, తాను ఆ పని సభలో చేయలేదని ఆయన అన్నారు. శాసనసభలో బుధవారం సాయంత్రం మాజీ మంత్రి, కాంగ్రెసు ఎమ్మెల్యే ఎస్ఎస్ మల్లికార్జున్‌తో కలిసి వీడీడియో చూడడం వెలుగులోకి రావడంతో వివాదం ప్రారంభమైంది. అదే సమయంలో బిజెపి శాసనసభ్యుడు ప్రభు చవాన్ కూడా ప్రియాంక గాంధీ చిత్రాలను జూమ్ చేస్తూ కనిపించారు.

అంబరీష్ సెల్ ఫోన్ పట్టుకున్న దృశ్యాలను కొన్ని టీవి చానెళ్లు ప్రసారం చేశాయి గానీ నిజానికి ఆయన ఏం చూస్తున్నారనే చిత్రాలను స్పష్టం చూపించలేకపోయాయి. అంబరీష్ ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్న ఫొటో వాట్సప్ ద్వారా సర్క్యులేట్ అయింది. అయితే, చిత్రం ఎంత వరకు సరైంది అనేది తెలియదు.
బార్‌లో హిందీ చిత్రం పాపులర్ నెంబర్ చూస్తూ ఆనందిస్తున్న అంబరీష్ వీడియోను ఇద్దరు కాంగ్రెసు నాయకులు చూస్తూ కనిపించారని బిజెపి ఆరోపిస్తోంది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. బెంగళూరులోని ఓ బార్‌లో ఇటీవల ఆ వీడియోను చిత్రీకరించినట్లు చెబుతున్నారు. అయితే, చాలా నెలల క్రితం మాండ్యా జిల్లాలో రికార్డు చేశారనే వాదన కూడా వినిపిస్తోంది.
సభలో వీడియో చూడడంపై ప్రస్తావించగా - చెరుకు సమస్యపై చర్చ ముగిసిన తర్వాత మల్లికార్జున్ తన వద్దకు వచ్చారని, ఓ మెసేజ్ చూడాలని సూచించాడని, అయితే దాన్ని ఆయన ఓపెన్ చేయలేకపోయారని, తనకు ఆసక్తి లేదని, బయటకు పంపించాలని చెప్పానని అంబరీష్ అన్నారు.












Click it and Unblock the Notifications