నేను ఆలా కాదు: నీరవ్ మోడీ పరారీపై కార్తి చిదంబరం వ్యంగ్యం
న్యూఢిల్లీ: తనను దురుద్దేశంతోనే అరెస్టు చేశారని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం అన్నారు. బుధవారం చెన్నై విమానాశ్రయంలో సిబిఐ అధికారులు అరెస్టు చేసిన తర్వాత కోర్టులో ఆ విధంగా అన్నారు.
మద్రాసు హైకోర్టు అనుమతితోనే తాను విదేశాలకు వెళ్లానని దర్యాప్తు అధికారులకు తాను పూర్తిగా సహకరించానని ఆయన కోర్టులో చెప్పారు. ఆయనను సిబిఐ అధికారులు అరెస్టు చేసి పాటియాల కోర్టులో హాజరు పరిచారు.

ప్రభుత్వానికి గురి పెట్టిన కార్తి
తాను హిందుస్తాన్ లీవర్ కాదు గానీ హిందూస్తాన్ రిటర్నర్ (హిందుస్తాన్ నుంచి వెళ్లిపోయేవాడిని కాదు, హిందూస్తాన్‌కు తిరిగి వచ్చేవాడిని) అని ఆయన అన్నారు. కార్తి తరపున కోర్టులో కాంగ్రెసు సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ వాదించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై బిజెపి ప్రభుత్వ తీరును తప్పు పట్టడానికి కార్తి ఆ మాటలన్నట్లు అర్థమవుతోంది.
Recommended Video


నీరవ్ మోడీ పరారీపైనే...
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో నిందితుడు నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో మోడీ ప్రభుత్వంపై కాంగ్రెసు పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తూ వస్తోంది.

రాజకీయ నేత కుమారుడ్ని కాబట్టి అరెస్టు
రాజకీయ నేత కుమారుడిని కాబట్టే తనను లక్ష్యంగా చేసుకున్నారని కార్తి విమర్శించారు తన విదేశీ పర్యటనల విషయంలో సిబిఐ వాస్తవాలు చెప్పడం లేదని అన్నారు. కోర్టు అనుమతితోనే తాను విదేశాలకు వెళ్లానని, తనకు తాజా సమన్లు ఏవీ రాలేదని ఆయన చెప్పారు

రివార్డుగానే అరెస్టు
సమన్లకు స్పందించినందుకు రివార్డుగానే అరెస్టు చేశారని, వ్యక్తి స్వేచ్ఛకు అరెస్టు అత్యంత భంగకరమని అన్నారు. బాస్‌ల ముందు ప్రదర్శనకే సిబిఐ అరెస్టు చేసిందా అని ఆయనయ అడిగారు.

కార్తికి సిబిఐ కౌంటర్
కార్తి వాదనను సిబిఐ కౌంటర్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కార్తి సహకరించారని, విదేశాలకు వెళ్లే ముందు సమాచారం తమకు ఇవ్వలేదని చెప్పిది. కార్తి చిదంబరాన్ని తమ కస్టడీకి 15 రోజులు అప్పగించాలని కోరింది. ఒక్క రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications