ఏదో ఒక రోజు ప్రధానిని అవుతా: జతిన్ రామ్ మంఝీ

పాట్నా: ఏదో ఒక రోజు తాను ప్రధాన మంత్రిని కావచ్చునని బీహార్ ముఖ్యమంత్రి జతిన్ రామ్ మంఝీ అన్నారు. బీహార్ ముఖ్యమంత్రిని అయినట్లే దేశానికి తాను ప్రధాన మంత్రిని అవుతానని ఆయన బుధవారం ఓ అధికారిక కార్యక్రమంలో అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మహాదళిత్ కమ్యూనిటీకి చెందినవాడిని కాబట్టే ప్రతి ఒక్కరూ తనను లక్ష్యం చేసుకున్నారని ఆయన అన్నారు.

శక్తివంతమైనవారు తనను చూసి నవ్వుతారని, ముఖ్యమంత్రి ఎలా అయ్యాడని వారు తనను అపహాస్యం చేస్తారని ఆయన అన్నారు. వారు తనను లక్ష్యం చేసుకోవడం కొనసాగిస్తే ఏదో ఒక రోజు తాను ప్రధాన మంత్రిని అవుతానని ఆయన అన్నారు.

I may become prime minister one day: Bihar CM Jitan Ram Manjhi

లోకసభ ఎన్నికల్లో జెడి (యు) ఓడిపోవడంతో నితీష్ కుమార్ స్థానంలో జతిన్ రామ్ మంఝీ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. మిగతావారి వాళ్ల లాగా కాకుండా తాను హృదయం విప్పి మాట్లాడుతానని ఆయన అంటారు. ప్రజా జీవితంలో ఏదీ దాచుకోవడానికి లేదని అంటారు.

పేద దళిత కుటుంబంలో పుట్టడం తన తప్పా అని ఆయన ఉద్వేగభరితంగా ప్రశ్నించారు. 68 ఏళ్ల మంఝీ అగ్రవర్ణ రైతు వద్ద గొర్రెల కాపరిగా పనిచేసేవారు. తన సంపాదనతో తాను చదువుకున్నానని చెప్పారు. తన తండ్రి రామ్‌జీత్ రామ్ మంఝీ భూమిలేని కూలీ అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+