‘మగాళ్లందరూ రేపిస్టులే’నని అనలేదు: బాలీవుడ్ నటి నందితా దాస్
న్యూఢిల్లీ: మగ వాళ్లందరూ రేపిస్టులని తాను ఎప్పుడూ అనలేదని బాలీవుడ్ నటి నందితా దాస్ అన్నారు. ‘మవాళ్లందరూ రేపిస్టులే' అని నందిత పేర్కొందంటూ సామాజిక మాధ్యమాల్లో బాగా వ్యాప్తి చెందడంతో, వాటికి చెక్ పెట్టేందుకు నందిత వివరణ ఇచ్చుకున్నారు.
తాను మగవాళ్లందరూ రేపిస్టులని ఎప్పుడూ అనలేదని నందితా దాస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘మగవాళ్లంతా రేపిస్టులేనని నేనెప్పుడూ చెప్పలేదు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలను నేను అన్నట్లుగా ప్రచారం చేయడం తెలివితక్కువ పని. దీనిపై నేను వివరణ ఇవ్వాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది' అని నందితా దాస్ తెలిపారు.

‘మగవాళ్లందరూ రేపిస్టులే' అని నందితా దాస్ పేర్కొందంటూ ప్రచారం జరుగడంతో ఆమెపై నలుమూలల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో నష్టనివారణకు దిగిన నందితా దాస్ ట్విట్టర్లో వివరణ ఇచ్చి ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేశారు.
I'm being falsely quoted Never said all men are rapists. What kind of a stupid generalisation is that? sad that 1 have to even explain this.
— Nandita Das (@nanditadas) April 2, 2015 











Click it and Unblock the Notifications