Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రేమ ముసుగులో సాటి ఉద్యోగిని శీలం దోచుకున్నాడు, రూ. లక్షలు తీసుకుని, చంపేస్తా, ఏం చేస్తావు ?

బెంగళూరు: ప్రేమిస్తున్నానని నమ్మించిన ఓ యువకుడు యువతిని నిలువునా దోచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెతో చనువుగా ఉంటున్న ఆ యువకుడు ఆమెను లైంగికందా లొంగదీసుకుని ఎంజాయ్ చేశాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన అమ్మాయికి అసలు స్వరూపం చూపించిన యువకుడు అది మాత్రం కుదరదని, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో అన్నాడు. అమ్మాయి శీలం దోచుకున్న యువకుడు భారీ మొత్తంలో ఆమె దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఇంకోసారి పెళ్లి పేరు ఎత్తితే చంపేస్తా, ఏం చేస్తావు అంటూ రెచ్చిపోయిన ప్రియుడి మీద బీపీఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న బాధితురాలు బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తమిళనాడు అమ్మాయి

తమిళనాడు అమ్మాయి

తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల అమ్మాయి స్వప్నా (పేరు మార్చడం జరిగింది) బెంగళూరు నగరం చేరుకుని ఎలక్ట్రానిక్ సిటీలోని ప్రసిద్ది చెందిన బీపీఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. బెంగళూరు నగరంలోని కమ్మనహళ్ళిలో నివాసం ఉంటున్న లోహిత్ (24) అనే యువకుడు స్వప్నా పని చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఒకే చోట పని చేస్తున్న లోహిత్, స్వప్నాకు గత ఏడాది పరిచయం అయ్యింది.

నిన్నే ప్రేమిస్తున్నా

నిన్నే ప్రేమిస్తున్నా

స్వప్నా కంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైన లోహిత్ ఆమెతో స్నేహం పేరుతో దగ్గర అయ్యాడు. తరువాత నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని స్వప్నాకు లోహిత్ మాయమాటలు చెప్పాడు. తనకంటే రెండేళ్లు చిన్నవాడైనా నిజాయితీగా ఉన్నాడని భావించిన స్వప్నా సైతం లోహిత్ మాయమాటలు నమ్మింది. తరువాత స్వప్నా, లోహిత్ ప్రేమించుకున్నారు.

సినిమా కష్టాలు

సినిమా కష్టాలు

తన తండ్రి చనిపోయాడని, తల్లి, చెల్లిని తానే చూసుకుంటున్నానని, ఉద్యోగం చేసి తన కుటుంబ సభ్యులను పోషిస్తున్నానని లోహిత్ స్వప్నాకు తన సినిమా కష్టాల గురించి చెప్పాడు. నీ తల్లిని, చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని, నీకు ఏమి అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలని స్వప్నా తన ప్రియుడు లోహిత్ కు చెప్పింది. అయితే అతను చెప్పేవన్నీ సినిమా స్టోరీలు అని మాత్రం స్వప్నా తెలుసుకోలేకపోయింది.

పెళ్లి పేరుతో స్వప్నాతో జల్సాలు

పెళ్లి పేరుతో స్వప్నాతో జల్సాలు

లోహిత్ మాయమాటలు నమ్మిన స్వప్నా అతనినే పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లికి చెప్పింది. స్వప్నా మీద నమ్మకంతో ఆమె తల్లి లోహిత్ తో పెళ్లికి సరే అని చెప్పింది. తరువాత లోహిత్ స్వప్నాను నమ్మించి స్నేహితుల గదులకు, తన ఇంటికి తీసుకెళ్లి ఆమెను లైంగికంగా లొంగదీసుకున్నాడు. లోహిత్ పెళ్లి చేసుకుంటాడని పూర్తిగా నమ్మిన స్వప్నా సైతం అతనికి లైంగిక కోరికలు తీర్చడానికి సరే అని అంగీకరించింది. అయితే లోహిత్ తనను మోసం చేస్తాడని స్వప్నా ఊహించలేకపోయింది.

ప్రియుడు కాదు ఊసరవెల్లి

ప్రియుడు కాదు ఊసరవెల్లి

10 నెలల క్రితం మరో మంచి ఉద్యోగంలో చేరాలని నిర్ణయించిన స్వప్నా పని చేస్తున్న ఉద్యోగం నిలిపివేసింది. ఉద్యోగం లేక జీతం రాకపోవడంతో స్వప్నా ప్రియుడు లోహిత్ డబ్బులు ఇవ్వడం నిలిపివేసింది. ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో లోహిత్ తన అసలు స్వరూపం చూపించాడు. స్వప్నా వెంటపడిన లోహిత్ తనకు డబ్బులు ఇవ్వాలని ఎక్కడపడితే అక్కడ టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వనందుకు ఓసారి నడిరోడ్డులో స్వప్నా మీద లోహిత్ దాడి చేసి ఆమెను శారీరకంగా హింసించాడని ఆరోపణలు ఉన్నాయి.

పట్టించుకోని తల్లి, సోదరి

పట్టించుకోని తల్లి, సోదరి

లోహిత్ టార్చర్ ఎక్కువ కావడంతో తట్టుకోలేని స్వప్నా అతని తల్లి, సోదరికి విషయం చెప్పింది. లోహిత్ గురించి విషయం మొత్తం చెప్పినా అతని తల్లి, సోదరి పట్టించుకోకపోవడంతో స్వప్నా విసిగిపోయింది. తరువాత తన దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వాలని స్వప్నా లోహిత్ కు చెప్పింది. డబ్బుల విషయం అడగడంతో లోహిత్ రానురాను స్వప్నాను దూరం పెడుతూ వచ్చాడు. చివరికి ఫోన్ చేసినా రిసీవ్ చెయ్యడం లేదని, తన మేసేజ్ లకు సమాధానం ఇవ్వడం లేదని స్వప్నా పోలీసులను ఆశ్రయించింది.

రూ. శీలం దోచుకుని, రూ. 4 లక్షలు తీసుకుని !

రూ. శీలం దోచుకుని, రూ. 4 లక్షలు తీసుకుని !

పెళ్లి పేరుతో తన శీలం దోచుకున్నాడని, గత 10 నెలల నుంచి షాపింగ్ బిల్లులు, ఖర్చుల కోసం తన దగ్గర రూ. 4 లక్షలకు పైగా తీసుకుని లోహిత్ మోసం చేశాడని స్వప్నా ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ఎందుకు అన్యాయం చేశావని, ఫోన్లు ఎందుకు రిసీవ్ చెయ్యడం లేదని ప్రశ్నించినా అతని పట్టించుకోవడం లేదని స్వప్నా పోలీసులకు చెప్పింది.

పెళ్లి పేరు ఎత్తితే చంపేస్తా

పెళ్లి పేరు ఎత్తితే చంపేస్తా

పెళ్లి అంటూ తన వెంటపడితే నిన్ను చంపేస్తానని, పోలీసు అధికారులు తనకు బాగా తెలుసని, కేసు లేకుండా చేసుకునే సత్తా తనకు ఉందని, మర్యాదగా నువ్వు సైలెంట్ గా ఉండిపోవాలని లోహిత్ తనను బెదిరించాడని స్వప్నా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తానతో ఏకాంతంగా ఉన్న సమయంలో లోహిత్ వీడియోలు, ఫోటోలు తీశాడని అనుమానం ఉందని, తనకు న్యాయం చెయ్యాలని స్వప్నా ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులను ఆశ్రయించిది. లోహిత్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+