అద్వానీ బాధను అర్థం చేసుకోగలను: 'రాజీనామా'పై సుమత్రా

అద్వానీ బాధను తాను అర్థం చేసుకోగలనని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఆమె మాజీ ప్రధాని చంద్రశేఖర్ పైన రాసిన పుస్తకావిష్కరణ సమయంలో అద్వానీ బాధపడిన తీరుపై స్పందించారు.

న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, సీనియర్ ఎంపీ లాల్ కృష్ణ అద్వానీ ఆవేదన పైన స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం నాడు స్పందించారు. సభ జరుగుతున్న తీరు పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అద్వానీ.. రాజీనామా చేయాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలపై స్పీకర్ కొద్ది గంటల అనంతరం స్పందించారు. అద్వానీ బాధను తాను అర్థం చేసుకోగలను అన్నారు. ఆమె మాజీ ప్రధాని చంద్రశేఖర్ పైన రాసిన పుస్తకావిష్కరణ సమయంలో అద్వానీ బాధపడిన తీరుపై స్పందించారు.

lk advani

పార్లమెంట్‌లో పలు విషయాలను గురించి చర్చించాలని, ఎంపీలు సభను అడ్డుకునే దాని కంటే చర్చలో పాల్గొంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవం వేరుగా ఉందన్నారు. సభ నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, అంతకుముందు అద్వానీ సభ నడుస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో చర్చ సజావుగా జరగకపోవడం విచారకరమన్నారు. సభ జరుగుతున్న తీరు చూస్తుంటే, ఎంపీ పదవికి రాజీనామా చేయడమే మేలనిపిస్తోందన్నారు.

పార్లమెంట్‌ సజావుగా జరిగేందుకు విపక్షాలతో మాట్లాడాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సూచించారు. మాజీ ప్రధాని వాజపేయీ సభలో ఉంటే ఈ పరిస్థితి చూసి ఆయన ఎంతో బాధపడేవారన్నారు.

నవంబర్‌ 16న ప్రారంభమైన పార్లమెంట్‌ ఉభయసభల సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. అయితే, సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచి ఈ రోజు వరకు దేనిపైనా చర్చ జరిగింది లేదు. నవంబర్‌ 8న ప్రధాని మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై చర్చ జరగాలంటూ విపక్షాలు ఉభయసభలను స్తంభింపజేయడంతో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+