అదేం ఎంటర్టైన్మెంట్ కాదు, వ్యక్తిగతం: కోహ్లీ రిలేషన్‌పై అనుష్క
సిడ్నీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మధ్య సంబంధం ఉన్న విషయం తెలిసిందే. గతంలో వారిద్దరు గప్‌చుప్‌గా బయట తిరిగినప్పటికీ, ఇప్పుడు బహిరంగంగా తిరుగుతున్నారు. ఈ విషయమై అనుష్క శర్మ స్పందించారు.
తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని, అది తమ వ్యక్తిగత జీవితమని, తమ పర్సనల్ జీవితాన్ని వినోదంగా చూడదల్చుకోలేదని ఆమె అన్నారు. అందుకే దాని గురించి తాను ఎవరితోను మాట్లాడదల్చుకోలేదని అభిప్రాయపడ్డారు.

అయితే, ఆమె తన ప్రొఫెషనల్ వర్క్ పైనే ఎక్కువగా మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమీర్ ఖాన్‌తో కలిసి నటించిన పీకే చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం భారత్‌లో, అబ్రాడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎవరైనా వర్క్ బాగా చేస్తే తాను ప్రశంసిస్తానని చెప్పారు.

ఎవరైనా బాగా చేస్తే తాను సంతోషిస్తానని చెప్పారు. అది తనకు ప్రేరణగా ఉంటుందన్నారు. 2014లో క్వీన్‌లో కంగనా రనౌత్ అదరగొట్టిందన్నారు. ఈ రంగం పోటీతో కూడుకున్నదని, అయితే, అందరం ఆర్టిస్ట్‌లమని, అలాంటప్పుడు ఎవరైనా బాగా చేస్తే సంతోషించక పోవడం సాదారణమే అన్నారు.












Click it and Unblock the Notifications