అమ్మాయిలు తాగేస్తున్నారు, నాకు భయమేస్తోంది: మనోహర్ పారికర్

Posted By:
Subscribe to Oneindia Telugu

పానాజీ: అమ్మాయిలు కూడా బీర్లు తాగడం ప్రారంభించారని, వారిని చూస్తుంటే తనకు భయమేస్తోందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు పెరిగిందని, అది ఎప్పుడో పరిమితిని దాటి పోయిందని ఆయన అన్నారు.

ఎగబడి అమ్మాయిలు బీర్లు తాగేస్తున్నారని, ఇది తనకు ఎంతో భయాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంటు‌‌‌కు హాజరైన ఆయన యువతను ఉద్దేసించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

'I've Begun To Fear As Even Girls Have Started Drinking Beer': Manohar Parrikar

తాను అమ్మాయిలందరినీ ఉద్దేశించి తాను మాట అనడం లేదని, ఇక్కడున్నవాళ్లలోనూ ఈ అలవాటు లేకపోలేదని, గోవాలో గత రెండేళ్లలో మద్యం సేవిస్తున్న అమ్మాయిల సంఖ్య విపరీతంగా పెరిగిందని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు

గోవాలో డ్రగ్ వ్యవస్థను రూపుమాపే ఆపరేషన్ కొనసాగుతోందని పారికర్ చెప్పార. కాలేజీల్లో డ్రగ్స్ కల్చర్ ఎక్కువగా ఉందని భావించడం లేదని, కానీ మొత్తానికే లేదనే వాదనతో మాత్రం తాను ఏకీభవించబోనని న్నారు.

ఇప్పటి వరకు 170 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశామని, చట్టంలోని లోపాలత నిందితులు తొందరగా బయటపడుతున్నారని, చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

గోవా యువత కష్టపడి పనిచేయడానికి ఇష్టపడడం లేదని, సులువుగా చేసే పనుల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రభుత్వోద్యోగం అంటే పని ఉండదనే భావనతో ఉన్నారని ఆయన అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Goa Chief Minister Manohar Parrikar is a worried man these days as girls have started consuming alcohol.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి