మరోసారి స్థిరపడాలనుంది: అలనాటి నటి జీనత్ అమన్

I want to settle down again: Zeenat Aman
ముంబై: మళ్లీ స్థిరపడాలని అనుకుంటున్నట్లు అలనాటి అందాల నటి జీనత్ అమన్ చెప్పారు. నవంబర్ 19వ తేదీన ఆమెకు 63 ఏళ్లు వచ్చాయి. మరొకరితో తాను స్థిరపడాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఇన్నాళ్లూ తాను తన కుమారులు ఆజాన్, జహాన్‌లపైనే దృష్టి పెట్టానని, ఇప్పటి వరకు తనకు మరో ఆలోచన లేకుండా పోయిందని ఆమె అన్నారు.

వారి బాగోగులు, ఆనందమే ఇంతకాలం తనకు ముఖ్యంగా ఉంటూ వచ్చిందని, వారు పెద్దయ్యారని, వారి జీవితం వారు సాగిస్తారని, ఇప్పుడు మరోసారి తన వ్యక్తిగత జీవితంపై ఆలోచన చేస్తున్నానని జీనత్ అన్నారు. 1970 దశకంలో సినిమాలతో ఆమె తీరిక లేకుండా గడిపారు. దాదాపు 24 గంటలు పని చేస్తూ ఉండేవారు.

మజార్ ఖాన్‌తో 1985లో వివాహం కావడంతో సినిమాలు తగ్గాయి. 15 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పనిచేశానని, పెళ్లి చేసుకున్న తర్వాత ఓ పరిపూర్ణ స్థితికి చేరుకున్నానని, తాను వివాహంపైనా తన భర్తపైనా దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చిందని, ఆ తర్వాత ఇద్దరు పిల్లలను చూడాల్సి వచ్చిందని ఆమె అన్నారు.

ఇప్పుడు తన ఇద్దరు పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారని, వారి జీవితాలు వారు జీవించగలరని, వారికి బహుముఖ ప్రజ్ఞ ఉందని ఆమె అన్నారు. పెద్దవాడు గ్రాడ్యుయేట్ అని, చిన్నవాడు పాకశాస్త్రంలో, సంగీతంలో నటనలో అర్హత సాధించాడని, వారు ఏ వైపు వెళ్తారో చూడాల్సిందని ఆమె అన్నారు.

తనకు ఎవరి పట్ల కూడా ఏ విధమైన అసూయాద్వేషాలు లేవని, మంచివాళ్లు ఇంకా ఉన్నారని, ఎల్లవేళలా ప్రేమకు, చాంపియన్‌షిప్‌కు చోటు ఉందని తాను నమ్ముతానని జీనత్ అమన్ అన్నారు. తనకు ప్రస్తుతం తగిన పాత్రలు సినిమాల్లో దొరుకుతాయని అనుకోవడం లేదని, మంచికైనా చెడుకైనా తాను పని కోసం పరుగులు పెట్టదలుచుకులేదని, ఆ పని తాను ఏనాడూ చేయలేదని, తన వద్దకు వచ్చినవాటిలో ఎంపిక చేసుకుంటానని ఆమె అన్నారు.

తనకు తగిన సినిమా వచ్చినప్పుడు మాత్రమే తాను నటిస్తానని చెప్పారు. నటించడానికి నటించడమనే పని తాను చేయబోనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+