నాపై సుప్రీంకోర్టు జడ్జి లైంగిక వేధింపులు: లేడీ లాయర్

న్యూఢిల్లీ: ఓ యువ మహిళా న్యాయవాది సంచలనమైన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు తనను లైంగికంగా వేధించారని, ఇప్పుడు ఆ న్యాయమూర్తి రిటైరయ్యారని ఆమె తెలిపారు. వైద్యవిద్యార్థినిపై సామూహిక అత్యాచారంపై ఢిల్లీ నిరసనలతో అట్టుడుకుతున్న సమయంలో తాను ఇంటర్నీగా చేరానని ఆమె తెలిపారు.

కోల్‌కతాలోని జ్యూరిడికల్ సైన్సెస్ జాతీయ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకున్న ఆమె ఢిల్లీలోని ఓ హోటల్ గదిలో న్యాయమూర్తి తనను వేధించారని ఆమె తెలిపింది. జర్నల్ ఆఫ్ ఇండియా లా అండ్ సొసైటీ కోసం ఈ సంఘటన గురించి నవంబర్‌లో తన బ్లాగ్‌లో ఆమె వివరించారు.

I was sexually harassed by Supreme Court judge: lawyer

తన డిగ్రీ ఫైనలియర్‌లో ఇంటర్నీషిప్ కోసం తాను న్యాయమూర్తి వద్ద చేరానని, తన తాత వయస్సులో ఉన్న ఆ వ్యక్తి తనపై లైంగిక వేధింపులకు దిగాడని ఆమె చెప్పింది. తాను ఆ గది నుంచి తప్పించుకుని బయటపడ్డప్పటికీ ఆ సంఘటన తన జ్ఞాపకాల నుంచి తొలగిపోలేదని ఆమె వ్యాఖ్యానించింది.

అదే విషయాన్ని ఆ మహిళా న్యాయవాది లీగల్లీ ఇండియా పబ్లికేషన్స్‌ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. మరో ఇద్దరిని కూడా ఆ న్యాయమూర్తి అదే రీతిలో లైంగిక వేధించారని తాను విన్నట్లు ఆమె చెప్పారు. ఇతర అమ్మాయిలు అలాంటి ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడడానికి ఆ సంఘటనను తాను వెల్లడించాలని అనుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. ఈ మహిళా న్యాయవాది ఆరోపణలకు సంబంధించిన వార్తాకథనాలు జాతీయ మీడియాలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+