ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీలోకి జంప్, ఖార్గే బచ్చా, అధికారం, సిద్దూకు షాక్!

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు మే 12వ తేదీ జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆరుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు ఆ పార్టీ నాయకుల తీరుతో విసిగిపోయారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి జంప్ అవుతున్నానని గురువారం సీనియర్ ఎమ్మెల్యే మాలికయ్య గుత్తేదార్ బాంబుపేల్చారు. ప్రియాంక్ ఖార్గే ఓ బచ్చా అంటూ ఎమ్మెల్యే మాలికయ్య గుత్తేదార్ సిద్దూకు షాక్ ఇచ్చారు.

ఆరు సార్లు ఎమ్మెల్యే

ఆరు సార్లు ఎమ్మెల్యే

కర్ణాటకలోని కులబరిగి జిల్లాలోని అఫ్జల్ పూర్ శాసన సభ నియోజక వర్గం నుంచి 7 సార్లు పోటీ చేసిన మాలికయ్య గుత్తేదార్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2013 శాసన సభ ఎన్నికల్లో మాలికయ్య గుత్తేదార్ 38,093 ఓట్లతో విజయం సాధించారు.

యడ్యూరప్పతో భేటీ

యడ్యూరప్పతో భేటీ

గురువారం మద్యాహ్నం బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న బీఎస్. యడ్యూరప్ప ఇంటికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మాలికయ్య గుత్తేదార్ వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం బీఎస్. యడ్యూరప్ప ఇంటి నుంచి బయటకు వచ్చిన మాలికయ్య గుత్తేదార్ అక్కడే మీడియాతో మాట్లాడారు.

బీజేపీకి షరతులు

బీజేపీకి షరతులు

ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన తనను కాంగ్రెస్ పార్టీ నిర్లక్షం చేసిందని, కనీస మర్యాద ఇవ్వడం లేదని మాలికయ్య గుత్తేదార్ మీడియా ముందు వాపోయారు. కాంగ్రెస్ పార్టీ తీరుతో విసిగిపోయి తన మద్దతుదారులతో చర్చించానని, అందరూ బీజేపీలో చేరాలని సూచించారని మాలికయ్య గుత్తేదార్ అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా బీజేపీలో చేరాలని నిర్ణయించానని మాలికయ్య గుత్తేదార్ చెప్పారు.

బచ్చాలు మంత్రులు

బచ్చాలు మంత్రులు

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను పక్కన పెట్టిన సీఎం సిద్దరామయ్య ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రియాంక్ ఖార్గేకి మంత్రి పదవి ఇచ్చారని మాలికయ్య గుత్తేదార్ ఆరోపించారు. ప్రియాంక్ ఖార్గే ఓ బచ్చా, అతని గురించి ఎక్కువ మాట్లాడను, కులబరిగి జిల్లాలో ప్రియాంక్ ఖార్గే ఎక్కడ నుంచి పోటీ చేసిన కచ్చితంగా ఓడిపోతాడని మాలికయ్య గుత్తేదార్ అన్నారు.

స్పీకర్, కాంగ్రెస్

స్పీకర్, కాంగ్రెస్

స్పీకర్ బెంగళూరులో లేరని, ఆయన వచ్చిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి లేఖ ఇస్తానని మాలికయ్య గుత్తేదార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను, తన మద్దతుదారులు రాజీనామాలు చేస్తానని, తరువాత బీజేపీలో చేరుతామని మాలికయ్య గుత్తేదార్ మీడియాకు చెప్పారు.

కొడుక్కు టిక్కెట్ అడగలేదు

కొడుక్కు టిక్కెట్ అడగలేదు

తాను, తన సోదరుడు మాత్రమే రాజకీయాల్లో ఉన్నామని, తన కుమారుడికి కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ అడగలేదని, కుటుంబ రాజకీయాలు చెయ్యలేదని, అఫ్జల్ పూర్ లో తన గుర్తు తానే అని, ఏ పార్టీ నుంచి అయినా గెలుస్తానని మాలికయ్య గుత్తేదార్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దం కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంగుతిన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+