I2U2: జో బైడెన్‌ కొత్త కాన్సెప్ట్: మోడీతో భేటీ: ఆ రెండు దేశాధినేతలు కూడా:

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. తన పశ్చిమాసియా దేశాల పర్యటన సందర్భంగా ఈ భేటీ ఏర్పాటు కానుంది. మోడీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌తోనూ సమావేశమౌతారు. వర్చువల్ విధానంలో ఈ సమావేశం ఏర్పాటవుతుందని వైట్‌హౌస్ వెల్లడించింది.

ఈ భేటీకి ఐ2యూ2 (I2U2)గా పేరు పెట్టినట్లు తెలిపింది. ఐ2యూ2లో.. ఐ అనే అక్షరం ఇండియా, ఇజ్రాయెల్‌ను సూచిస్తాయి. యూ అనే అక్షరం యూఎస్ఏ, యూఏఈని ప్రతిబింబిస్తాయి. గత ఏడాది అక్టోబర్‌లో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ సమావేశం ప్రతిపాదనకు వచ్చింది. జైశంకర్ సహా మిగిలిన మూడు దేశాల విదేశీ మంత్రులు ఐ2యూ2 భేటీకి అంగీకరించారు. అబ్రహం ఒప్పందం ప్రకారం.. ఈ ఫోరమ్ ఏర్పాటు కావాల్సి ఉంది.

I2U2: Joe Biden host a summit with PMs of India, Israel and UAE President during his visit

ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ కోసం అప్పట్లో జైశంకర్.. ఇజ్రాయెల్ పర్యటన కొనసాగింది. ఈ సారి ఇదే కాన్సెప్ట్‌తో ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా- జో బైడెన్ వచ్చే నెల 13 నుంచి 16వ తేదీ వరకు పశ్చిమాసియా దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఇజ్రాయెల్ సందర్శన సందర్భంగా జో బైడెన్ పలు కీలక అంశాలపై చర్చిస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొరాకో, బహ్రెయిన్‌ దేశాధినేతలో సంప్రదింపులు జరుపుతారు.

భారత్-అమెరికా-ఇజ్రాయెల్-యూఏఈ ఒకే వేదిక మీదికి రావడం ఇదే తొలిసారి. మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్ సెక్యూరిటీ, .. వంటి కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు వస్తాయని వైట్‌హౌస్ తెలిపింది. అబ్రహం అకార్డ్స్‌లో భాగంగా ఈ భేటీ ఉంటుందని, పశ్చిమాసియా రీజియన్‌లో పరస్పర సహకారాలను పెంపొందించే దిశగా మరో ముందుడుగు పడినట్టవుతుందని వ్యాఖ్యానించింది.

కాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో జో బైడెన్ పశ్చిమాసియా దేశాల పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రీజియన్‌లో రష్యాకు గట్టి మద్దతు ఉన్న విషయం తెలిసిందే. భారత్.. సుదీర్ఘకాలంగా రష్యాకు మిత్రదేశంగా ఉంటోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో తటస్థంగా ఉంటూ వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+