కూలిన సూపర్ హెర్క్యులస్: ఐదుగురు మృతి

అమెరికాలో తయారైన నాలుగు ఇంజన్ల ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో పలు రక్షిత ఏర్పాట్లు ఉన్నాయి. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ కూలడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు సాగుతున్నాయి. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు భారత వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది.
రాజస్థాన్‌లోనికరౌలీ జిల్లాలో ఆ ప్రమాదం సంభవించింది. సి-130జె ఎయిర్‌క్రాఫ్ట్‌లను 2011 ఫిబ్రవరి నుంచి భారత వైమానిక దళం తీసుకుంటూ వస్తోంది. వాటిలో అరడజను ఇప్పటికే పనిచేస్తున్నాయి. మరో ఆరు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది.
ప్రత్యేక బలగాల కదలికలకు, కష్టతరమైన ప్రదేశాల్లో ల్యాండింగ్‌కు ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు బాగా పనిచేస్తాయి. ఉత్తరాఖండ్ వరదల సమయంలో ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమర్థంగా పనిచేశాయి.












Click it and Unblock the Notifications