విమానం దగ్గరకే రానివ్వరు.. ఇక అమ్ముతారా? కాక్‌పిట్ కూడా చూపించలేదు..

అమెరికా అత్యంత ఆధునిక యుద్ధ విమానం ఎఫ్‌-35 (F-35) కొనుగోలు ప్రతిపాదనలపై భారత వాయుసేన (IAF) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్పందించిన తీరు ఇప్పుడు రక్షణ రంగంలో పెను సంచలనంగా మారింది. జోధ్‌పూర్‌లో శనివారం ముగిసిన 'తరంగ్ శక్తి-2026' అంతర్జాతీయ వాయుసేన విన్యాసాల ముగింపు వేడుకల సందర్భంగా అమెరికా పసిఫిక్ ఎయిర్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ కెవిన్ష్ స్నేడర్ పక్కనే ఉన్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అసలు అమెరికా తమకు ఎఫ్‌-35 జెట్లను విక్రయించే ప్రతిపాదన ఏమైనా చేసిందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. "మీ వాళ్లు కనీసం ఆ విమానం దగ్గరికి కూడా మమ్మల్ని రానివ్వడం లేదు.. ఇక అమ్మడం గురించి మీరెలా మాట్లాడుతున్నారు?" అంటూ ఆయన అమెరికా తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

IAF Chief AP Singh Swipes at US Over F35 Stealth Jets They Do Not Even Let Us Near the Aircraft

అమెరికా తీరుపై ఎసరు: కాక్‌పిట్ చూపించని వైనం

ఈ ఏడాది జరిగిన 'తరంగ్ శక్తి' విన్యాసాల కోసం అమెరికాకు చెందిన ఆరు ఎఫ్‌-35 లైటెనింగ్ II యుద్ధ విమానాలు తొలిసారిగా భారత్‌కు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు ఈ అత్యాధునిక జెట్ల కొనుగోలుకు సంబంధించి ఏమైనా యాక్సెస్ ఇచ్చారా అని మీడియా ప్రశ్నించగా.. అమెరికా తమకు విమానం కాక్‌పిట్‌ను మాత్రం చూపించలేదని, అయితే తమ విమానాలతో కలిసి క్లోజ్ ఫార్మేషన్ ప్రయాణించడానికి మాత్రం అనుమతించిందని ఏపీ సింగ్ స్పష్టం చేశారు.

F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి!
F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి!

ప్రోటోకాల్ పరిమితులే కారణం: అమెరికన్ కమాండర్ స్పష్టత

భారత వాయుసేన చీఫ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికన్ పసిఫిక్ ఎయిర్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ కెవిన్ష్ స్నేడర్ స్పందిస్తూ.. ఎఫ్‌-35 సమాచారాన్ని పంచుకోవడం తన ఒక్కడి చేతుల్లో ఉన్న నిర్ణయం కాదని తేల్చిచెప్పారు. ఈ విమానానికి సంబంధించి కొన్ని కఠినమైన సెక్యూరిటీ క్లాసిఫికేషన్ గైడ్స్ ఉంటాయని, ఏ సమాచారాన్ని ఎప్పుడు పంచుకోవాలి, దాన్ని ఏ విధంగా రక్షించాలనేది ఆ నిబంధనలే నిర్ణయిస్తాయని ప్రోటోకాల్ ను ఆయన వివరించారు.

రష్యా నుంచి SU-57 ఆఫర్: ఐదు తరం యుద్ధ విమానాల కోసం భారత్ అన్వేషణ

మరోవైపు స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేస్తున్న 'అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్' (AMCA) తయారై వాయుసేనలో ప్రవేశపెట్టడానికి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం పట్టేలా ఉంది. ఈ లోగా ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల కొరతను తీర్చుకునేందుకు భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇదే సమయంలో రష్యా తన దేశానికి చెందిన Su-57 ఐదవ తరం యుద్ధ విమానాలను విక్రయించేందుకు ఆఫర్ చేసిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ధృవీకరించారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

Video: గగనతలంలో ఘోర ప్రమాదం, గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు
Video: గగనతలంలో ఘోర ప్రమాదం, గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు

చైనా, పాకిస్థాన్ కదలికలతో పెరుగుతున్న సవాళ్లు

పొరుగు దేశాలైన చైనా తన ఆధీనంలో ఉన్న J-20, J-35 వంటి అత్యాధునిక స్టెల్త్ విమానాల సంఖ్యను వేగంగా పెంచుకుంటోంది. అంతేకాకుండా చైనా నుంచి పాకిస్థాన్ కూడా సుమారు 40 J-35 యుద్ధ విమానాలను పొందే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ సరిహద్దుల్లో మన దేశ రక్షణ భద్రతను బలోపేతం చేసుకోవడానికి ఐదవ తరం యుద్ధ విమానాల అవసరం ఎంతైనా ఉంది. అయితే కేవలం విమానం కొనుగోలు మాత్రమే కాకుండా.. టెక్నికల్ ట్రాన్స్ఫర్, మెయింటైనెన్స్, వెపన్ అటాచ్ మెంట్ వంటి దీర్ఘకాలిక వ్యూహాత్మక అంశాలను బేరీజు వేసుకుంటూ భారత్ తగు నిర్ణయాలు తీసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+