Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాపిష్టి పాక్ : మళ్లీ భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానం..కూల్చివేసిన వాయుసేన..?

పాకిస్తాన్ మరోసారి భారత్‌పై దాడికి యత్నించిందా...? ఇందులో భాగంగా యుద్ధ విమానాలతో దాడిచేసేందుకు స్కెచ్ గీసిందా..? ఇప్పుడిప్పుడే చల్లబడుతున్న యుద్ధ వాతావరణంపై మరోసారి అగ్గి రాజేస్తోందా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. భారత రక్షణశాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. రాజస్థాన్‌లో ఓ అనుమానిత విమానం గగనతలంలో కనిపించిందని రక్షణశాఖ వెల్లడించింది. ఉదయం 11:30 గంటల సమయంలో ఇది భారత గగనతలంలో ఎగురుతూ అనుమానాస్పదంగా కనిపించిందని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇది చూసేందుకు డ్రోన్‌లా కనిపించిందని పేర్కొంది రక్షణశాఖ.

ఈ అనుమానిత విమానం లేదా డ్రోన్‌ను భారత గగనతలంలో గుర్తించగానే భారత్‌కు చెందిన యుద్ధ విమానాలు దాన్ని తరుముకుంటూ వెళ్లి కూల్చేశాయి. గగన తలం నుంచి గగనతలంలో శతృవును కూల్చగల క్షిపణితో ఈ అనుమానిత విమానంను కూల్చేశాయి. అయితే ఈ అనుమానిత విమానంను కూల్చగానే అది పాకిస్తాన్ సరిహద్దులో పడిపోయినట్లు భారత రక్షణశాఖ వివరించింది. శకలాలు పాక్ సరిహద్దులోని ఎమ్ డబ్ల్యూ తోబా ప్రాంతంలోని ఇసుక గనుల్లో పడినట్లు భారత రక్షణ శాఖ తెలిపింది.

IAF jets shoot down unidentified Pakistani aircraft that crossed border in Rajasthan

భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ అనుమానిత విమానం భారతగగనతలంలో కనిపించడాన్ని తీవ్రంగా పరిగణించింది భారత్. ఫిబ్రవరి 26న భారత వాయుసేన సరిహద్దు రేఖ దాటి పాకిస్తాన్‌లోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి తిరిగి భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మరుసటి రోజు పాకిస్తాన్ భారత గగనతలంలోకి వచ్చి సైనిక స్థావరాలపై తమ యుద్ధ విమానాలతో దాడి చేయాలని భావించగా భారత వాయుసేన తిప్పికొట్టింది. బాలాకోట్‌లో భారత వైమానిక దాడికి మిరాజ్ యుద్ధ విమానాలను వినియోగించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+