యాదృచ్ఛికం.. రీల్-రియల్: హీరో కార్తి నటించిన ఆ సినిమాకు అభినందన్ తండ్రి కన్సల్టెంట్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న అభినందన్ వర్తమాన్ తండ్రి, ఎయిర్ మార్షల్ ఎస్ వర్థమాన్ 2017లో తమిళంలో వచ్చిన 'కాత్రు వెలియిదాయ్' తమిళ సినిమాకు కన్సల్టెంట్‌గా పని చేశారు. కార్తి, అదితి రావు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ (ఐఏఎఫ్) నేపథ్యంలో తీసిన సినిమా.

సినిమాకు కన్సల్టెంట్‌గా పని చేసిన అభినందన్ తండ్రి

సినిమాకు కన్సల్టెంట్‌గా పని చేసిన అభినందన్ తండ్రి

'కాత్రు వెలియిదాయ్' సినిమాలో హీరో కార్తి ఐఏఎఫ్‌ పైలట్‌గా నటించాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రాన్ లీడర్ అయిన వరుణ్ చక్రపాణి (హీరో కార్తి) 1999 కార్గిల్ వార్ సమయంలో పాకిస్తాన్‌లోకి చొచ్చుకు వెళ్తాడు. అతని యుద్ధవిమానాన్ని పేల్చేస్తారు. రావల్ఫిండిలో పాకిస్తాన్ సైన్యం అతనిని బంధిస్తుంది. అతను పాకిస్తాన్ సైన్యం చేత యుద్ధఖైదీగా ఎన్నో హింసలు భరిస్తాడు. పాక్ సైన్యం అతనిని హింసిస్తుంది. పాకిస్తాన్ కస్టడీలో ఉన్న వరుణ్ (హీరో కార్తి).. లీలతో గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. లీలగా నటి అదితి రావు హైదరి నటించింది.

అభినందన్ తండ్రి నైపుణ్యం కలిగిన ఐఏఎఫ్ అధికారి

అభినందన్ తండ్రి నైపుణ్యం కలిగిన ఐఏఎఫ్ అధికారి

ఈ సినిమాకు ఎవరైతే సలహాదారుగా పని చేశారో ఆ ఎయిర్ మార్షల్ ఎస్ వర్ధమాన్ తనయుడు అభినందన్ ఇప్పుడు పాకిస్తాన్ కస్టడీలో ఉన్నారు. 'కాత్రు వెలియిదాయ్' సినిమా సలహాల కోసం దర్శకుడు మణిరత్నం ఎయిర్ మార్షల్ ఎస్ వర్ధమాన్‌ను సంప్రదించారు. ఎవరైతే సినిమాకు కన్సల్టెంట్‌గా పని చేశారో ఆ ఎయిర్ మార్షల్ కొడుకు.. అభినందన్ ఇప్పుడు పాక్ కస్టడీలో ఉన్నారు. కాగా, అభినందన్ తండ్రి అయిన ఎయిర్ మార్షల్ ఎస్ వర్ధమాన్ అత్యంత నైపుణ్యం కలిగిన ఐఏఎఫ్ అధికారి.

కార్తి ట్వీట్

కార్తి ట్వీట్

కాగా, అభినందన్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్న విషయం తెలిసి హీరో కార్తీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. సినిమా సందర్భంగా తాను కొందరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లను కలిశానని, అది తన అదృష్టమని పేర్కొన్నారు. మన వారియర్స్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అభినందన్ జీవితంలో రియాలిటీకి, రీల్‌కు కొన్ని దగ్గరి పోలికలు ఉండటం యాధృచ్ఛికం. అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని యావత్ భారత్ ప్రార్థిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+